ఎన్నో రోజులుగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఈరోజు ఆదివారం హైదరాబాద్ నోవెటల్ లో ఈవెంట్ జరగబోతుంది అని తెలియగానే వేలాదిమంది అభిమానులు ఎన్టీఆర్ ని లైవ్ లో చూసేందుకు ఎగబడిపోయారు. దేవర ఈవెంట్ లో ఎన్టీఆర్ ని ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో వచ్చిన ఫ్యాన్స్ కు పోలీసులు షాకిచ్చారు. లెక్కకు మించి ఫ్యాన్స్ ఈవెంట్ ప్రాంగణానికి రావడంతో పోలీసులు, ఈవెంట్ నిర్వాహకులు చేతులెత్తేశారు.
నోవెటల్ లోపలికి అనుమతి వచ్చేవరకు ఆ ప్రాంతం అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో జనసంద్రమైంది. ఒక్కసారిగా గేట్లు అన్ని తోసుకొని నోవోటల్ లోపలికి వచ్చిన ఫాన్స్... హోటల్ లోపల అద్దాలు ధ్వంసం చేసి మరీ వేలాదిగా ఆడిటోరియం లోపలికి దూసుకువచ్చారు.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 20వేల మందికి పైగా ఎన్టీఆర్ ఫాన్స్ రావడం తో అక్కడి సెక్యూరిటీ, పోలీసులు కూడా చేతులెత్తెయ్యడంతో అక్కడ జరిగిన చిన్నపాటి తోపులాటలో పలువురికి గాయాలు అయ్యాయి. దానితో రంగలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి ఫాన్స్ ను చెదరగొట్టారు.. అంతేకాదు ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక దేవర ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఈవెంట్ ప్రాంగణం నుంచి అభిమానులను పోలీసులు వెనక్కి పంపించివేస్తున్నారు, దేవర ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది చెప్పి పోలీసులు వారిని వెనక్కి పంపించివేస్తున్నారు.