నేషనల్ క్రష్ రష్మిక జోరు సినిమా ఇండస్ట్రీలో మాములుగా లేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్తో రష్మిక పరుగులు పెడుతుంది. ముంబై-హైదరాబాద్-చెన్నై అంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతూ దిగే ఫ్లైట్ దిగుతుంది. పుష్ప 2 షూటింగ్ అలాగే, కుబేర షూటింగ్ ఫినిష్ చేసే పనిలో రష్మిక ఉంది. మరోపక్క ఈమధ్యనే సికిందర్ షూటింగ్ లో జాయిన్ అయ్యి తెగ ఎగ్జైట్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రశ్మిక ఈ మధ్యనే చిన్న యాక్సిడెంట్ జరిగి కోలుకుని మళ్ళీ యాక్టీవ్ అయ్యి షూటింగ్స్ కోసం బయలు దేరింది. యాక్సిడెంట్ అయిన కొద్దిరోజులు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా లేని రష్మిక ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఫోటో షూట్స్ తో హడవిడి మొదలు పెట్టింది.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో రష్మిక షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని కిర్రాక్ ఫోజులతో కత్తిలాంటి లుక్ తో మెస్మరైజ్ చేసింది. రష్మిక గ్లామర్ లుక్ చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.