యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాబోతున్న చిత్రం దేవర. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న దేవర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఆదివారం హైదరాబాద్ లో జరగనుంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ గెస్ట్ లుగా హాజరు కాబోతున్న ఈ ఈవెంట్ పై అందరి చూపు ఉంది. కారణం తెలుగులో దేవర కు జరుగుతున్న మొదటి పబ్లిక్ ఈవెంట్ ఇది.
ఇక దేవర చిత్రం పై కొరటాల నే కాదు ఎన్టీఆర్ కూడా పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. తాజాగా దేవర మూవీని వీక్షించిన రాజమౌళి కాంపౌండ్ మెంబెర్ ఒకాయన దేవర చిత్రం పై చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లోకి పంపిస్తున్నాయి. దేవర పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ అలా అలా ఉన్నపటికీ సెకండ్ హాఫ్ అదిరిపోయింది, అందులోను చివరి అరగంట ఇంకాస్త అదిరిందని అంటూ సన్నిహితుల దగ్గర మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
ఇప్పటికే దేవర ఇంటర్వెల్ బ్లాంక్ మైండ్ బ్లోయింగ్ అని, సెకండ్ హాఫ్ పై వస్తున్న సూపర్ కామెంట్స్ సోషల్ మీడియాలో దేవర పై విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి కాంపౌండ్ నుంచి దేవర కు వస్తున్న ఫీడ్ బ్యాక్ మరింత అంచనాలు పెంచేసింది. మరి దేవర ఫస్ట్ రిపోర్ట్ చూసాక ఆడియన్స్ లో దేవర విషయంలో ఇంకాస్త అంచనాలు పెరగడం ఖాయం.