Advertisement
Google Ads BL

టీటీడీ లడ్డులో జంతు నూనె.. నిజమా సీబీఎన్?


భూలోక వైకుంటమే తిరుమల తిరుపతి.. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీవేంకటేశ్వరునితో సమానమైన దైవంగాని ఉండబోదు..! కలియుగ దైవం శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై ఇప్పుడు పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో జంతువుల నూనె వాడారనే ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, శ్రీవారి భక్తులను అయోమయంలో పడేసింది. అసలు ఇప్పుడే ఎందుకు ఈ ప్రకటన వచ్చిందో..? ఇదంతా వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న చంద్రబాబు అప్పుడేం చేశారు..? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

Advertisement
CJ Advs

బాబు ఏమన్నారు..?

గత 5 ఏళ్ళలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీసారు.. అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారు..తిరుమల లడ్డూ విషయంలో గతంలో జరిగింది చూస్తే బాదేస్తోంది.. తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది.. విషయం తెలిసి ఆందోళన చెందాను.. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం.. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నామని ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవీ.

ఇదే నిజమైతే..?

ఒకవేళ ఇదే నిజం ఐతే.. అసలు అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్టునే జనాల్లోకి ఓ రేంజిలో రచ్చ రచ్చే చేసి వైసీపీని ఘోరాతి ఘోరంగా ఓడించిన టీడీపీ కూటమి.. టీటీడీ లడ్డులో జంతు నూనె అనే విషయాన్ని ఇంకెంతలా ప్రచారం చేసేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పోనీ టీడీపీ లేకున్నా హిందువుల లేటు అని చెప్పుకునే బీజేపీ అయినా ఈ పాయింట్ పట్టుకొని నానా రచ్చ చేసేది ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అలాంటిది ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది అనేది ఏడుకొండల వెంకన్నకే తెలియాలి. పోనీ ఇప్పటికైనా పోయిందేమీ లేదు కదా.. మీ దగ్గర ఆధారాలు ఉంటే లేదా మీకు అనుమానమైతే ఒక విచారణ చేసి నిజమని తేలితే కారకులు ఎవరైనా కఠినంగా శిక్ష వేయొచ్చు కదా. పోనీ సీబీఐ ఎంక్వయిరీ వేయొచ్చు కదా అన్నది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్నలు.

నమ్ముతారా.. పెద్ద అగ్ని పరీక్షే..?

తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల నూనె వాడతారని ఆ స్వామివారిని పూజించే వారెవరూ నమ్మరు. అంతర్జాతీయ స్థాయి ప్రయోగశాల పర్యవేక్షణలో ప్రసాదం తయారవుతుంది ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక శ్రీవారి సన్నిధిలో లడ్డు తయారీ చేసేది బ్రాహ్మణులే.. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారనీ మనకు తెలుసు.. వారికి తెలియదా..? నెయ్యి గురించి..? ఇవన్నీ కాదు ఆ స్వామివారిని పూజించే వారెవరైనా నమ్మే స్థితిలో ఉన్నారా..? అంటే అస్సలు కానే కాదు. నిజంగా.. శ్రీవారి భక్తుల ముందు ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష ప్రత్యక్షమైందని చెప్పుకోవచ్చు. లడ్డూలో జంతువుల నూనె సాధ్యమా..? అన్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశుని భక్తుల మదిలో వ్యక్తమవుతున్నాయి. ఈ దేవస్థానంలో స్వామి వారికి సమర్పించే ప్రసాదం తయారు చేయడంలో కొన్ని విధానాలు పూర్వ కాలం నుంచీ ఇప్పటి వరకూ అమలవుతూ వస్తున్నాయి.. అవి ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా అమలవుతాయి.. ప్రభుత్వ పెద్దలు లేదా మరెవరైనా చెప్పినట్టు చేయడానికి ఈ దేవస్థానం ప్రసాదం విధి విధానాలు అంగీకరించవు అన్నది టీటీడీ విధి విధానాలు బాగా తెలిసిన వాళ్ళు చెబుతున్న మాటలు.

వైసీపీ ఇలా..!

వైసీపీ హయాంలో జరిగిందనే చంద్రబాబు సంచలన ప్రకటనపై వైసీపీ గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారనీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు.. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు సుబ్బారెడ్డి. రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించరని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు భూమన.

ఇందుకేనా..?

తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదనే విషయం జగమెరిగిన సత్యమే. ఎందుకంటే.. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాలమీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతులమీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాలమీదుగా తయారయ్యే ప్రసాదాలమీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే.. బురదరాజకీయాలకు పరాకాష్ట అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. విశాఖ ఉక్కు చర్చ,  MBBS సీట్లు, వైఎస్ జగన్ వరద సహాయ చర్చ, స్కూల్లో CBSE/ IB సిలబస్, మహిళలపై లైంగిక దాడులు, నీకు 15, నీకు 18 చర్చ, రాష్ట్ర అప్పులు, జమిలి (One Nation One Election) ఎన్నికల చర్చ, అమరావతి నీటి చర్చ, మద్యం, ఇసుకపై చర్చ నడుస్తుండగా ఇవ్వన్నీ డైవర్ట్ చెయ్యడానికి లడ్డు చర్చ తెరపైకి తెచ్చారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఈ వ్యవహారం ఐతే ఇప్పట్లో తేలదు.. ఎంత వరకూ వెళ్తుందో..? ఎవరెవరు ఎలా స్పందిస్తారో..? చివరికి ఏమవుతుందో చూడాలి మరి.

Animal oil in TTD laddu.. Is it true CBN?:

  There is now a big rush going on for the Tirumala Laddu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs