మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సిద్దార్థ్-అదితి రావు లు అప్పటి నుంచి డేటింగ్ చేసుకుంటున్నా ఆ విషయాన్ని బయటపెట్టకుండా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సైలెంట్ గా తెలంగాణలోని వనపర్తి లోని అదితి రావు పూర్వీకుల కట్టించిన 400 ఏళ్ళ నాటి టెంపుల్ లో నిశ్చితార్ధం చేసుకుని ఆ విషయాన్నితాపీగా బయటపెట్టారు.
ఇక పెళ్లి విషయంలోనూ అంతే సైలెన్స్ ని మైంటైన్ చేసారు. మార్చ్ లో నిశ్చితార్ధం అవగా.. ఈ నెలలోనే రీసెంట్ గా సిద్దార్థ్-అదితి లు ఓ ఇంటివారయ్యారు. మళ్ళీ అదే వనపర్తి గుడిలో సిద్దార్థ్-అదితి రావు లు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇరు కుటుంబాల నడుమ సింపుల్ గా వివాహం చేసుకున్నారు.
తాజాగా అదితి రావు-సిద్దార్థ్ లు తాము ఎలా కలుసుకున్నామో, తమ బంధం ఎలా మొదలైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. సిద్దార్థ్-అదితిలలో ముందుగా సిద్దార్థ్ అదితికి లవ్ ప్రపోజల్ పెట్టాడట. ఇక ఇద్దరూ గొడవపడితే ముందుగా అదితినే సిద్దు కు సారి చెబుతుందట, సిద్దార్థ్ కు ఉదయం లేవడం ఇష్టముండదు, కాని అదితి కు మాత్రం వేకువ ఝామునే నిద్ర లేవడం అలవాటు.
సిద్దార్థ్ ను కూడా ఉదయమే లేపేసి సూర్యోదయాన్ని ఎంజాయ్ చెయ్యాలని చెబుతుందట. ఆ సమయంలో చిన్నపిల్లాడి చేతిలో చెక్ లెట్ లాగేసుకున్నట్టుగా అదితి నా నుంచి నిద్ర లాగేసుకుంటుంది అంటూ సిద్దు కంప్లైంట్. అది అదితి లో సిద్ధుకు నచ్చని క్వాలిటీ అంట. సిద్దార్థ్ క్యాజువల్ వేర్స్ లో నచ్చుతాడు, సిద్దు తాను మాట్లాడే 100 మాటల్లో 90 తప్పులు ఉంటాయి. ఆ మిగతా పది లో ఆమెకు థాంక్స్ చెప్పేవే ఉంటాయంటూ ఈ కొత్త జంట సరదాగా ముచ్చట్లు పెట్టింది.