Advertisement
Google Ads BL

జగన్ చేతకాని తనమే


వైసీపీ పార్టీలో ఎంతోమందిపై ఎన్నో అభియోగాలున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై అనవసరమైన కామెంట్స్ చేసిన ఆయన తన నేతలపై వచ్చిన అభియోగాలపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తన వెంటే ఉంచుకోవడాన్ని ఏమంటారు, అది జగన్ చేతకాని తనమే మరి.

Advertisement
CJ Advs

అంతెందుకు రీసెంట్ గా వైసీపీ ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీను తన భార్య విషయంలో తప్పు చేసి దివ్వెల మాధురి తో సంబంధం పెట్టుకోవడం ఎంత సంచలనం అయ్యింది. అయినప్పటికి అది దువ్వాడ వ్యక్తిగత వ్యహారం అని వైసీపీ నేతలు కొట్టిపారేశారు. 

తమ పార్టీ ఎమ్యెల్సీ తప్పు చేస్తే శిక్షించలేని జగన్మోహన్ రెడ్డి ఇతరులపై కామెంట్స్ చేసే రైట్ ఉందా.. కూటమి ప్రభుత్వం మాత్రం తమ పార్టీలో ఎవ్వరు తప్పు చేసినా మరో ఆలోచనలు లేకుండా నిర్ధాక్షిణ్యంగా వేటు వేస్తుంది. తిరుపతి ఎమ్యెల్యే టీడీపీ కార్యకర్తను లోబరుచుకున్న ఘటనలో 24 గంటల్లో అతన్ని సస్పెండ్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. 

ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఉన్న జానీ మాస్టర్ పై ఓ లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టడంతో జానీ మాస్టర్ పై 24 గంటలు గడవకుండానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని యాక్షన్ తీసుకుంది పార్టీ. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు పనులు చేసిన నేతలపై ఏంతో  స్పీడుగా యాక్షన్ తీసుకుంటే జగన్ మాత్రం తన నేతల తప్పులు కప్పి పుచ్చడం అది జగన్ చేతకాని తనమనే చెప్పాలి. 

గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, ఇలా ఎంతోమందిపై ఎన్నో అభియోగాలొచ్చినా జగన్ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని జగన్ ఇంకా పక్కన పెట్టుకునే తిరుగుతున్నాడు. అంటే జగన్ కి తన నేతలపై వేటు వేసే దమ్ములేదా అనేది నెటిజెన్స్ ప్రశ్న. 

Jagan is not himself:

What is wrong with Jagan Mohan Reddy?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs