Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8: కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ


బిగ్ బాస్ సీజన్ 8 ఏ కోశానా ఇంట్రస్టింగ్ గా కనిపించడం లేదు. గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ రోజునే ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అంటే స్టార్ మా సీరియల్స్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సేర్స్ ని చూసి బుల్లితెర ప్రేక్షకులు నీరుగారిపోయారు. ఇక హౌస్ లో వారంతా చేసే రచ్చ చూస్తే అసలు ఇది బిగ్ బాస్ హౌసా లేదంటే చేపల మర్కెట్టా అంటారు. 

Advertisement
CJ Advs

హౌస్ లో టాస్క్ ల విషయంలో, నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ మద్యన జరిగే రచ్చ చూస్తే అది చేపల మార్కెట్ ను తలపిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ప్రేరణ నాగమణికంటకు ఫుడ్ పెట్టే విషయంలో వ్యవహరించిన తీరుకు విష్ణు ప్రియా ఏడవడం చూస్తే విష్ణు ప్రియా ప్రేరణ విషయంలో బాగా హార్ట్ అయినట్లుగా అనిపిస్తుంది. 

కిచెన్ టీం లో ఉన్న ప్రేరణ ఓ టమాటా తీలుసుకురమ్మని విష్ణు ప్రియను అడగగా.. అది మీ పని, మీ క్లాన్ చెయ్యాల్సింది అందుకే నేను చెయ్యను అని చెప్పగా ఆ కోపం మనసులో పెట్టుకున్న ప్రేరణ ఆతర్వాత నాగమణికంఠ కు ఫుడ్ పెట్టే విషయంలో కాస్త కరుకుగా కనిపించడం విష్ణు ప్రియా కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. ప్రేరణ ఫుడ్ పెట్టే తీరు నచ్చలేదని ఏడ్చేసింది. 

హౌస్ మేట్స్ ఆమెను ఓదార్చారు. మరి నాగమణికంఠ ప్రేరరణను అడగగా ప్రేరణ కాస్త రూడ్ గానే అతనికి ఆన్సర్ ఇచ్చిన ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానుంది. 

Bigg Boss 8: A tearful Vishnu Priya:

Bigg Boss 8: Prerana vs Vishnu Priya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs