Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఆశ ఎప్పుడు తీరుతుందో?


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో అవకాశం వస్తే ఏ దర్శకుడు వదులుకుంటాడు, అందులోను ఆ దర్శకుడితో తనకు సినిమా చెయ్యాలని ఉంది అని చెప్పగానే ఆ డైరెక్టర్ కి పండగే. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తనకు తమిళంలో ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్ అని చెప్పడమే కాదు, తన కోసం కథ తయారు చెయ్యమని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నిన్న మంగళవారం చెన్నై వెళ్ళారు. అక్కడ మీడియా మీట్ లో ఎన్టీఆర్ ని ఓ రిపోర్టర్ ఎన్టీఆర్ ని మీకు తమిళంలో అభిమాన దర్శకుడు ఎవరు, తమిళ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగ్గానే.. దానికి ఎన్టీఆర్ వెంటనే బదులిస్తూ, నేను వెట్రిమారన్‌కి వీరాభిమానిని, ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి నాతో ఓ తమిళ సినిమా చేయండి. 

మీరు తమిళంలో సినిమా చేస్తే కావాలంటే దానిని తెలుగులో డబ్ చేద్దాం. దయచేసి నాతో సినిమా చేయండి అంటూ ఎన్టీఆర్ వెట్రిమారన్ కు రిక్వెస్ట్ చెయ్యడం నిజంగా క్రేజీగా ఉంది. మరి వెట్రిమారన్ హీరోలలో నటుడిని స్టయిల్ గా కాదు ఒరిజినల్ గా చూపించడమే కాకుండా, నటుడి లోని అన్ని కోణాలను బయటకు తీసుకురాగల సత్తా ఉన్న దర్శకుడు. 

అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా అంటే క్రేజ్ కాక మరేముంటుంది. చూద్దాం ఎన్టీఆర్ కోరిక ఎప్పుడు తీరుతుందో అనేది. 

NTR keen on this director:

NTR Dreams To Star Under Vetrimaaran Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs