Advertisement
Google Ads BL

తమిళ తంబిల మనసు దోచేసిన జాన్వీ కపూర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా పాన్ ఇండియా ఫిలిం దేవర తో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. ఆ చిత్రంలో తంగం కేరెక్టర్ లో సింపుల్ గానే కనిపించినా దేవర పాటల్లో అందాలు చూపించే విధానానికి యూత్ అప్పుడే జాన్వీ కపూర్ భజన మొదలు పెట్టేసారు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల తో కలిసి పలు రాష్ట్రాల్లో కలియతిరుగుతున్న జాన్వీ కపూర్.. గత రాత్రి చెన్నై లో మెరిసింది. చెన్నై లో దేవర ప్రెస్ మీట్ లో చీర కట్టులో చిలిపిగా కనిపించింది. ఎన్టీఆర్, జాన్వీ, అనిరుద్ రవించంద్రన్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ ఈవెంట్ లో జాన్వీ కపూర్ తమిళ తంబిల మనసులను దోచేసింది 

శ్రీదేవి అంటే తెలుగు, తమిళ, హిందీ భాషల ప్రేక్షకుల్లో తెలియని వారుండరు. ఆమె కుమార్తె గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడు తల్లి లేకుండానే సౌత్ లోకి అడుగుపెట్టింది. ఇక చెన్నై దేవర ఈవెంట్ లో జాన్వీ కపూర్ స్పీచ్ మొదలు పెట్టిన విధానమే కాదు ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత వెంటనే తమిళ్ లో మాట్లాడి మెస్మరైజ్ చేసింది. 

జాన్వీ కపూర్ తమిళం స్పష్టంగా మాట్లాడడం చూసి అక్కడివారు షాకయ్యే ఉంటారు. తనకు చెన్నై ఎంత స్పెషలో అని, చిన్నతనంలో తన తల్లితో ఉన్న మంచి జ్ఞాపకాలన్నీ చెన్నైతో ముడిపడినవే, తనకిప్పుడు మళ్ళీ తన ఇంటికి తిరిగొచ్చినట్లు అనిపిస్తోందని.. తనకే కాదు తన తల్లి శ్రీదేవికి చెన్నై చాలా స్పెషల్ అని జాన్వి చెప్పుకొచ్చింది. 

తన తల్లిని తమిళ ఆడియన్స్ ఎంతో ఆదరించారు.. తనకు కూడా మీరందరూ అలాంటి ప్రేమనే పంచాలని ఆమె కోరింది.. ఆమె వినయం, తడబాటు లేకుండా తమిళం మాట్లాడిన విధానానికి తమిళులు నిజంగా ముచ్చటపడిపోతున్నారు. 

Janhvi Kapoor stole the hearts of Tamil thambis:

Janhvi Kapoor Cute Tamil Speech at Devara Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs