Advertisement

ఢిల్లీ సీఎంగా అతిశీ.. ఎవరీమే.. ఎందుకు!?


అవును.. ఢిల్లీకి అతిశీ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ముందుగానే మనం cinejosh.com లో చెప్పుకున్నాం..! అనుకున్నట్టుగానే జరిగింది. రెండ్రోజుల వ్యవధిలోనే ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం నాడు జరిగిన కేజ్రీవాల్‌ అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో మంత్రిగా ఉన్న అతిశీని సీఎంగా ప్రతిపాదించడం జరిగింది. ఈమె పేరు కేజ్రీవాల్ ప్రకటించగా.. ఆప్ ఎమ్మెల్యేలు అంతా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండా అతిశీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. దీంతో ఢిల్లీకి కొత్త సీఎం ఎవరనేది తేలిపోయింది. ఇంతవరకూ అంతా ఓకే కానీ ఎవరీ అతిశీ..? అంతా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండగా అతిశీనే ఎందుకు..? ఎందుకు ఇంతలా ఆమెను కేజ్రీ నమ్మారు..? అని యావత్ దేశ వ్యాప్తంగా రాజకీయ ఔత్సాహికులు చర్చించుకుంటున్న పరిస్థితి.

Advertisement

ఎవరీ అతిశీ..?

అతిశీ.. అతిశీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు వినిపిస్తున్న లేరు. ఈమె గురుంచి చెప్పాలంటే సమయమే సరిపోదు అంతే. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్, త్రిప్తా వాహీ దంపతులకు అతిశీ జన్మించారు. పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్‌లో.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్రను అభ్యసించారు. చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. కొన్నేళ్ల తర్వాత విద్యా పరిశోధనలో రోడ్స్ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్ నుంచి రెండో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో 7 సంవత్సరాలు గడిపారు. అక్కడ ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా వ్యవస్థలలో పాలుపంచుకున్నారు. అనేక ఎన్జీవోలతో కూడా కలిసి పని చేశారు. 

అధికార ప్రతినిధి నుంచి సీఎం దాకా..!

ఆ తర్వాత అతిశీ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావంలో కండువా కప్పుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో కీలక పాత్ర పోషించారు. పార్టీ ఏర్పాటు మొదలుకుని.. పార్టీ విధానాలను నిర్ణయించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనంతరం ఆప్ అధికార ప్రతినిధిగా సమస్యలను వివరించే బాధ్యతను స్వీకరించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. 2023లో తొలిసారిగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019లో తూర్పు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ పై 4.77లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అతిశీ ఎన్నికయ్యారు. ఇప్పుడు కేవలం ఏడాది తరువాత 2024లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.

గ్రేట్ కదా..!

నాటి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా కూడా పనిచేశారు. సిసోడియా జైలుకు వెళ్ళిన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇలా ఒకటి రెండు కాదు.. ఢిల్లీ ప్రభుత్వంలో గరిష్ట సంఖ్యలో శాఖలలో 14 శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత.. విద్యా శాఖ, PWD, నీటి శాఖ, రెవెన్యూ, ప్లానింగ్, ఫైనాన్స్ వంటి ముఖ్యమైన శాఖలను కేజ్రీవాల్ అప్పజెప్పారు. ఢిల్లీలోని పాఠశాలల్లో విద్య నాణ్యతను మరింత మెరుగుపరచడానికి కృషిచేశారు. కేజ్రీవాల్‌కు ఉన్న నమ్మకం, సాన్నిహిత్యం కాకుండా, అనేక ఇతర అంశాలు అతిషిని కలిసి వచ్చిన అంశాలు. 14 శాఖలను మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కానే కాదు కదా. అందుకే నిజంగా అతిశీని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు సీఎం పదవి కూడా దక్కడం మామూలు విషయం కానే కాదు. కేవలం నాలుగేళ్లలో ఎమ్మెల్యే, మంత్రి, సీఎం కూడా కావడం ఆషామాషీ విషయం కానే కాదు. అతిశి కృషి, నీతి, నిజాయితీకి దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు.

సీఎం సతీమణిని కాదని..!

కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచీ.. ఎక్కడ చూసినా ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు గట్టిగా వినిపించింది.. కనిపించింది. ఆఖరికి ఢిల్లీ సీఎం పదవి రేసులో ఎక్కువగా వినిపించింది కూడా. అంతేకాదు.. ఆప్ ఎమ్మెల్యేలు సైతం సునీతను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావించారు. ఓ వైపు ఆప్ నుంచి పూర్తి మద్దతు.. మరోవైపు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అందరూ సునీతనే సీఎం అని భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో, వ్యూహాత్మకంగా అతిశీ పేరును తెరపైకి తీసుకొచ్చి తనలోని రాజకీయ చాణక్యతను బయటపెట్టారు కేజ్రీవాల్. ఇప్పటివరకూ అంతా ఓకే కానీ.. నవంబర్ నెలలో మహారాష్ట్రతో పాటు ఎన్నికలు ఉంటాయా..? లేదా ఫిబ్రవరిలోనే ఉంటాయా..? ఇప్పటివరకూ గెలిపించిన రాజధాని ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారా..? లేదంటే బీజేపీని గెలిపిస్తారా..? అనేది చూడాలి. ఇక సీఎంగా అతిశీ తన మార్క్ ఎలా చూపిస్తారో చూడాలి మరి.

Atishi as Delhi CM:

AAP Atishi To Be Delhi New Chief Minister
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement