వినాయక చవితికి ప్రతి ఇంట్లోనే కాదు గల్లీ గల్లీల్లో, అపార్ట్మెంట్స్ లో, అలాగే బాలాపూర్, ఖైరతాబాద్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇలా హైదరాబాద్ మొత్తంలో వినాయకుడు ప్రతిమలను ప్రతిష్టించి పూజలు చేసి వాటిని 11 వ రోజు పలు నదుల్లో నిమజ్జనాలు చెయ్యడం అనేది ప్రతి ఏడు జరుగుతున్న తంతే. ఇక వినాయకుడును ప్రతిష్టించడం ఆయన చేతిలో భారీ లడ్డులను పెట్టడం అనేది కూడా చూస్తున్నాం.
ఆ లడ్డులను వేలం వెయ్యడం భారీ ధరలకు వాటిని వేలం వెయ్యడం తమకు మంచి జరుగుతుంది అని చాలామంది లక్షల్లో లడ్డులను వేలంలో దక్కించుకోవడం అనేది కూడా ప్రతి ఏడు చూస్తున్నాం, ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డుకు రికార్డ్ ధరతో వేలం పాట లో దక్కిచుకోవడం చూస్తున్నాం. గత ఏడాదే హైదరాబాద్ శివారులోని ఓ కాస్ట్లీ వీళ్లల్లో జరిగిన లడ్డూ వేలం కోటి దాటెయ్యడమే షాకింగ్ అయితే.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన రేటు చూస్తే దిమ్మతిరగడం ఖాయం.
గత ఏడాది ఏ రిచ్ మండ్ విల్లాల వారు వినాయక లడ్డు వేలంలో రికార్డు ధర పలకగా.. ఈసారి దాన్ని మించి ఏకంగా రూ.1.87 కోట్లు లడ్డు ధర పలికింది. కానీ రిచ్ మండ్ విల్లాలలో ఏ ఒక్కరో ఈ లడ్డుని దక్కించుకోరు, అక్కడ వీరందరికి చెందిన ట్రస్టు తరఫున అక్కడి వారంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపట్టి ఇలా లడ్డు వేలం చేపడతారు. బాలాపూర్ లడ్డు ఈసారి 30 లక్షలు దాటేసింది. ఇక్కడ మై హోమ్ కమ్యూనిటీలో కూడా గణేష్ లడ్డు ఏకంగా 29 లక్షల ధరకు వేలంలో ఒకరు దక్కించుకున్నారు.