Advertisement

త్రివిక్రమ్-బన్నీ అతి త్వరలో సెట్స్ పైకి..


అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 ముగించే పనిలో ఉన్నాడు. సుకుమార్-అల్లు అర్జున్ ఇంకా కీలక నటులంతా పుష్ప 2 చిత్రీకరణలో తలమునకలై ఉన్నారు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పుష్ప 2 ను ముగించేసి అల్లు అర్జున్ తన తదుపరి మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ఎప్పుడో అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. 

Advertisement

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ కాంబో సెట్స్ మీదకి వెళుతుందా అని అల్లు అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే త్రివిక్రం గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ స్క్రిప్ట్ పైనే ఉన్నారు. అల్లు అర్జున్ ఎప్పుడు ఫ్రీ అవుతాడో ఆ వెంటనే పాన్ ఇండియా లెవల్లో సినిమాని స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

అతి త్వరలోనే భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-త్రివికం కాంబో మూవీ మొదలు పెట్టేందుకు రంగం సిద్దమవుతుంది అని.. అది దసరా కు పూజా కార్యక్రమాలతో మొదలు అయ్యి రెండు నెలల తర్వాత రెగ్యులర్ షూట్ కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ పూర్తిగా త్రివిక్రం మూవీ పైకే వెళతాడని టాక్. 

Trivikram-Bunny on the sets very soon..:

 Allu Arjun, Trivikram film to go on floors?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement