Advertisement
Google Ads BL

హేమ బాధ వర్ణనాతీతం


నటి హేమ గత రెండు మూడు నెలలుగా అందరిని కన్ఫ్యూజ్ చేసి ఆడిస్తుంది. ఆమె రేవ్ పార్టీకి హాజరైంది అని బెంగుళూరు పోలీసులు చెబుతున్నా నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు అంటుంది, ఆమె డ్రగ్స్ తీసుకుంది, హేమ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ లకు ఇచ్చామంటే, నేను ఏ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వలేదు అంటుంది, మీడియానే కావాలని తనని బ్లేమ్ చేస్తుంది అంటుంది. కాదు నేనిప్పుడే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను, అందులో నెగెటివ్ వచ్చింది, నేను డ్రగ్స్ తీసుకోలేదు అంటుంది. 

Advertisement
CJ Advs

పోలీసులు నోటీసులు ఇస్తే రెండుసార్లు విచారణ తప్పించుకున్న హేమ మూడోసారి బెంగుళూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణకు తీసుకెళ్లారు. తర్వాత బెయిల్ పై బయటికొచ్చిన హేమ ఇంకా ఇంకా తాను డ్రగ్స్ తీసుకోలేదని వాదిస్తుంది. తన తల్లి తనపై వస్తున్న వార్తలు విని హెల్త్ పాడుచేసుకుంది అంటుంది. తాజాగా హేమ శాంపిల్స్ లో నెగెటివ్ కాదు, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అవడంతో హేమ పేరు ఛార్జ్ షీట్ లో కి ఎక్కించడంతో మరోసారి హేమ హై డ్రామా మొదలుపెట్టింది. 

తనకు తన లాయర్ గుడ్ న్యూస్ చెప్పారు, మీకు నెగెటివ్ వచ్చింది, మీ పేరు ఛార్జ షీట్ లో లేదు అని. తాను ఏ టెస్ట్ లకైనా సిద్ధమని సవాల్ చేసింది. ఇప్పుడు మరోసారి మరో వీడియో వదిలింది. తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదు, తనకి మీడియా టెస్ట్ చేయించుకోవచ్చు  అంటూ వీడియో వదిలింది. గతంలో ఏ మీడియా వాళ్ళు నేను డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రచారం చేసారో ఇప్పుడు అదే పాత వీడియోని తీసుకొచ్చి మళ్ళీ నేను డ్రగ్స్ తీసుకున్నట్టుగా కొత్తగా ప్రచారం చేస్తున్నారు. 

నేను ఛార్జ్ షీట్ చూడలేదు, నా చేతికి రాలేదు, అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది. నేను మీ దగ్గరకు వస్తాను టెస్ట్ చేయించుకోండి, ఒకవేళ పాజిటివ్ వస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం, ఇలాంటి రూమర్స్ వలన మా అమ్మకు ఎంగ్జైటీ రావడంతో నిమ్స్ లో చేరింది. పరువు కోసం ప్రాణాలిస్తాను, మా ఇంట్లో వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ తల దించుకునేలా నేను తప్పు చెయ్యను, చెయ్యలేదు అంటూ హేమ తెగ బాధపడిపోతూ మరో వీడియో వదిలింది. 

Tests will come near you.. Hema new video:

Actress Hema Drugs Case : Bangalore Police Filed Charge Sheet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs