Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8: హౌస్ మొత్తం అన్యాయం చేసింది


బిగ్ బాస్ సీజన్ 8 మొదలై రెండు వారాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా 14మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 మొదలయ్యింది. ఇంకా నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వారమే ఒకరిద్దరు హౌస్ లోకి వెళ్లొచ్చనే ప్రచారం జరుగుతుంది. 

Advertisement
CJ Advs

అదలా ఉంటే గత వారం హౌస్ నుంచి బెజవాడ బేబక్క ను ఎలిమినేట్ చేసిన ఆడియన్స్ ఈ వారం ఎవరిని ఎలిమినేషన్ లో నిలబెడతారో అనుకుంటే దానిని బిగ్ బాస్ పక్కనపెట్టి హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేషన్ సభ్యుల భవిష్యత్తును పెట్టారు. ఎనిమిదిమంది నామినేషన్స్ లో ఉంటే చివరికి శేఖర్ భాషా, ఆదిత్య ఓమ్ లను డేంజర్ జోన్ లో నిలబెట్టారు. 

శేఖర్ భాషా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పర్సన్ గా కనిపించగా, ఆదిత్య ఓమ్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరితో హౌస్ లో ఎవరు ఉండాలి, హౌస్ బయట ఎవరు ఉండాలనే విషయం నాగార్జున హౌస్ మేట్స్ ను అడగగా.. అందరూ శేఖర్ భాషాకు అన్యాయమే చేసారు. ప్రేరణ మొదలు ప్రతిఒక్కరు శేఖర్ భాష తన కొడుకుని చూసుకోవడానికి బయటికి వెళ్ళాలి, ఆయన ఆ విషయంలో స్ట్రెస్ ఫీలవుతున్నారు అని, ఆదిత్య ఓమ్ హౌస్ లో ఉండాలి అని ఆదిత్య మెడ లో దండలు వేశారు. 

చివరిగా సీత శేఖర్ భాషాను మిస్ అవుతున్నట్టుగా అతని మెడ లో దండ వేసింది. అంతేకాని మిగతా 11మంది కూడా శేఖర్ భాషాను ఇంటికి పంపించే ప్లాన్ చెయ్యడం చూస్తే హౌస్ మొత్తం శేఖర్ భాషాకు అన్యాయమే చేసింది అని చెప్పాలి. 

Bigg Boss 8: The entire house has been unfair:

Bigg Boss 8: Shekar Basha eliminated from house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs