Advertisement
Google Ads BL

అప్పుడు సజ్జల-ఇప్పుడు పెద్ది రెడ్డి


వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ కి రైట్ హ్యాండ్ గా, వైసీపీ పార్టీకి అన్ని తానై, జగన్ కి రాజకీయ సలహాదారునిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వలన పార్టీ అధికారం కోల్పోయింది. ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి వలన వైసీపీ సోషల్ మీడియా మొత్తం నాశనమైపోయింది అంటూ బ్లూ మీడియా టార్గెట్ చేసింది. జగన్ సజ్జల నించోమంటే నించున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి వలనే పార్టీకి కార్యకర్తలు, జగన్ కు నేతలు దూరమయ్యారని అంటున్నారు. 

Advertisement
CJ Advs

మొత్తానికి పార్టీ సజ్జల వలనే నాశనం అయ్యింది అంటూ జగన్ సజ్జలను పక్కనపెట్టేసేలా చేసారు. ఇప్పుడు సజ్జల స్థానాన్ని జగన్ మరొకరికి అప్పగించినట్టే కనిపిస్తుంది వ్యవహారం. సజ్జల స్థానాన్ని జగన్ తన ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డికి కీలక పదవులు కట్టబెట్టి భర్తీ చేసారని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన నియామ‌కాల్లో మొత్తం మూడు ప్రాముఖ్యత ఉన్న ప‌ద‌వుల‌ను జగన్ పెద్దిరెడ్డికే అప్ప‌గించారు.

వైసీపీ పార్టీలో కీల‌క‌మైన రాజ‌కీయ స‌ల‌హా క‌మిటీ స‌భ్యుడిగా పెద్ద‌రెడ్డిని నియ‌మించారు. అంతేకాదు చిత్తూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా, అలాగే నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా వైసీపీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను పెద్దిరెడ్డికే అప్ప‌గించ‌డం చూసిన వారు జగన్ సజ్జల స్తానం పెద్దిరెడ్డి కి ఇచ్చేసారు అప్పట్లో సజ్జల పై ఆధారపడిన జగన్ ఇప్పుడు పెద్దిరెడ్డిపై ఆధారపడతారేమో అని చెప్పుకుంటున్నారు. 

మరి సజ్జల లా  వైసీపీ పార్టీని పెద్దిరెడ్డి బ్రష్టుపట్టిస్తారా.. లేదంటే అనుభవంతో వైసీపీ పార్టీ ని మళ్ళీ అధికారంలోకి తెస్తారా అనేది చూద్దాం. 

Then Sajjala-now Peddi Reddy:

YS Jagan Appointed key leaders to strategic positions 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs