కోలీవుడ్ నటి మేఘ ఆకాష్ వివాహం చెన్నై లో ఈరోజు ఘనంగా జరిగింది. గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్న సాయి విష్ణు ను గత నెలలో ఎంగేజ్మెంట్ చేసుకుని ఈరోజు సెప్టెంబర్ 15 న అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. వారం రోజులుగా మేఘ ఆకాష్ పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాయి.
ఈరోజు ఆదివారం వివాహానికి కన్నా ముందే శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన మేఘ ఆకాష్ - సాయి విష్ణు ల వివాహ రిసెప్షన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటుగా పలువురు సెలెబ్రిటీస్ హాజరై మేఘ ఆకాష్ జంటను ఆశీర్వదించారు. తమిళ సాంప్రదాయ పద్దతిలో జరిగిన మేఘ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కెరీర్ పరంగా హీరోయిన్ గా అంతగా రాణించలేకపోయిన మేఘ ఆకాష్ ప్రేమ, పెళ్లి విషయంలో చాలా ప్రచారం జరిగింది. కానీ ఆరేళ్లుగా సాయి విష్ణు ను ప్రేమిస్తున్న మేఘ ఆకాష్ తన ప్రేమ ని బయటపెట్టిన కొద్దిరోజులకే పెళ్లి చేసేసుకుని ఓ ఇంటికి కోడలిగా మారిపోయింది.