Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడతాడా?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావడానికి 10 రోజుల సమయమే ఉంది. దేవర ప్రమోషన్స్, దేవర ప్రీ సేల్స్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎన్టీఆర్ దేవర వరస ఇంటర్వూస్, ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా కనబడుతున్నాడు. మరోపక్క సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన అనిరుధ్ రవిచంద్రన్ పై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. లియో, జైలర్, విక్రమ్ చిత్రాలతో అనిరుద్ పేరు మార్మోగిపోవడంతో దేవర BGM విషయంలోనూ అందరిలో అదే హైప్ ఉంది. సాంగ్స్ ని ట్రోల్ చేసినా అవి రికార్డ్ వ్యూస్ తో చితక్కొట్టేశాయి. 

ఎన్టీఆర్ కూడా అనిరుద్ పై చాలా నమ్మకం చూపిస్తున్నాడు. సందీప్ వంగ ఇంటర్వ్యూలో అనిరుద్ రవిచంద్రన్ వర్క్ పై నమ్మకాన్ని వ్యక్తం చేసాడు ఎన్టీఆర్. దేవర చిత్రం హాలీవుడ్ స్కోర్ క్వాలిటీకి తక్కువ ఏమీ కాదు. అనిరుధ్ త్వరలో హాలీవుడ్‌లో సత్తా చాటుతాడని చెప్పిన ఎన్టీఆర్ ని చూసి మీ నమ్మకాన్ని అనిరుద్ నిలబెడితే చాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.  

Will NTR keep the faith?:

Jr NTR calls Anirudh score for Devara world-class
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs