రాజ్ తరుణ్ సినిమాలను ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారనే విషయం ఈమధ్య కాలంలో అతను నటించిన సినిమా థియేటర్స్ చూస్తే తెలుస్తుంది. రెండు నెలలుగా మూడు సినిమాలు విడుదల చేసిన రాజ్ తరుణ్ కి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ ఇచ్చాయి. రొటీన్ కథలతో ఈ కుర్ర హీరో బాక్సాఫీసు పై దండయాత్ర చేస్తున్నాడు.
కానీ కాలం కలిసి రావడం లేదో లేదంటే అదృష్టం బాలేదో కాని వరస సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా రాజ్ తరుణ్ నుంచి వచ్చిన భలే ఉన్నాడే మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది. రాజ్ తరుణ్ నుంచి ఏ సినిమా వచ్చిన ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే దానికి భలే ఉన్నాడే సినిమానే పెద్ద ఉదాహరణ.
రాజ్ తరుణ్ తన పర్సనల్ విషయాలను పక్కనబెట్టి భలే ఉన్నాడే చిత్రానికి గట్టిగా ప్రమోషన్స్ చేసాడు. అయినా ఓపెనింగ్స్ లేవు అంతేకాదు భలే ఉన్నాడే థియేటర్స్ లో ప్రేక్షకులు లేక షోస్ క్యాన్సిల్ చేసిన ఘటన చూసాక రాజ్ తరుణ్ కి ఎలాంటి పరిస్థితి వచ్చింది అని ఆయన ఫ్యాన్స్ మధనపడుతున్నారు.
భలే ఉన్నాడే చిత్ర థియేటర్స్ లో మినిమమ్ ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్ చేసాయి థియేటర్ యాజమాన్యాలు. మరి ఈ రకమైన వార్తలు చూస్తే రాజ్ తరుణ్ కెరీర్ ఇకపై ఎలా ఉండబోతుందో అనేది అంచనా వెయ్యడం కష్టం కాదు. చూద్దాం అతను నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయో, ఉండబోతున్నాయో అనేది.!