నిన్న శుక్రవారం విడుదలైన మత్తు వదలరా 2 చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.. మత్తువదలరా పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో కామెడీ తగ్గింది అనే అభిప్రాయాలను ఆడియన్స్ వ్యక్తం చేసారు, మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకుడు, కీరవాణి కొడుకు సింహ కోడూరి, కమెడియన్ సత్య కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని సెలబ్రిటీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పుడు మత్తు వదలరా 2 చిత్రానికి మెగా రివ్యూ వచ్చేసింది. మెగాస్టార్ చిరు మత్తు వదలరా 2 చిత్రాన్ని వీక్షించి అందులో నటించిన నటులను, టెక్నీకల్ టీం ని అందరిని పేరు పేరునా అభినందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
నిన్ననే మత్తు వదలరా - 2 చూసాను.
ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి.
అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది
చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. Hats off
@RiteshRana నటీ నటులకు, @Simhakoduri23 కి , ప్రత్యేకించి #Satya కి నా అభినందనలు! అలాగే @fariaabdullah2, @kaalabhairava7 లకు మంచి విజయాన్ని అందుకున్న @mythriofficial సంస్థకు, టీం అందరికీ నా అభినందనలు!💐
Dont miss #MathuVadalara2 !!100% Entertainment Guaranteed 😊 అంటూ మెగాస్టార్ ట్వీట్ చేసారు.