టైటిల్ చూస్తే అదే అంటారు మెగా ఫ్యాన్స్. గేమ్ చెంజర్ సెకండ్ సింగిల్ సెప్టెంబర్ అన్నారు, డేట్ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఇప్పుడు సెప్టెంబర్ మధ్యలోకి వచ్చేసింది. ఆ డేట్ ఇస్తారా లేదంటే రిలీజ్ డేట్ లాగే నాన్చుతారా అని మెగా ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. గేమ్ చెంజర్ డిసెంబర్ 20 కి రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించడానికి ఎంతెలా వెయిట్ చేయిస్తున్నారు శంకర్ సర్ అంటూ వారు కొట్టుకుంటున్నారు.
ఇప్పటివరకు విడుదల తేదీ ఇవ్వకుండా మా సహనానికి పరీక్ష పెడుతున్నారు అంటూ గోల గోల చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటున్న దర్శకుడు శంకర్ రిలీజ్ తేదీ అనౌన్స్ చెయ్యడానికి ఎందుకంతగా ఆలోచిస్తున్నారు. డిసెంబర్ 20 కి ఇస్తే హరి బరి అవుతుంది అనా.. అంటే డిసెంబర్ లో సినిమా విడుదల ఉండదా..
అసలు శంకర్ గారు గేమ్ ఛేంజర్ విషయంలో ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఈ నీరసం ఏమిటి, ఇండియన్ 2 ఎఫెక్ట్ నుంచి శంకర్ గారు బయటికి రాలేదా.. వస్తే ఇలా ఉండరు కదా అనేది మెగా ఫ్యాన్స్ ప్రశ్న.