Advertisement
Google Ads BL

42 ఏళ్ల ఎంపీతో.. 54 ఏళ్ల రాహుల్ పెళ్లి


42 ఏళ్ల ఎంపీతో.. 54 ఏళ్ల రాహుల్ పెళ్లి..?

Advertisement
CJ Advs

ఇండియన్‌ పాలిటిక్స్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లిస్టులో కనిపించే తొలిపేరు రాహుల్‌ గాంధీ.. బహుశా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇకపై ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత పేరు కనిపించదు.. వినిపించదు ఏమో..! ఎందుకంటే రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పుడిదే జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి/ మహిళ..? ఇందులో నిజానిజాలు ఎంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.

అవునా.. నిజమా!

యువనేత రాహుల్ గాంధీకి ఇప్పుడు వయస్సు 54 ఏళ్లు. ఐనా పెళ్లి చేసుకోలేదు. ఎందుకు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. అదేంటి పెళ్లి చేసుకోవట్లేదు అంటే.. ఒకానొక నాకే ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉందని నవ్వేసి ఊరుకున్నారు. ఐతే.. పిల్లలు మాత్రం కావాలని చెప్పుకొచ్చారు. ఇదంతా గతంలో జరిగినది. తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రాహుల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు..! తన సోదరి ప్రియాంక గాంధీ.. అన్నను ఒప్పించి, మెప్పించి ఓ మహిళా ఎంపీని చూసారట. ఆమె మరెవరో కాదు.. ప్రణతి షిండే అని టాక్. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సుశీల్‌ కుమార్‌ షిండే.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా కూడా పనిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు.. నమ్మినబంటు. షిండే కుమార్తే ప్రణతి. వయస్సు 42 ఏళ్లు. షోలాపూర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈడూ.. జోడు కూడా!

ఇద్దరూ చూడటానికి.. ఈడు జోడు కూడా చక్కగా ఉండటంతో పెళ్లి చేసి అన్నను ఒక ఇంటివాడిని చేయాలని ప్రియాంక ఫిక్స్ అయ్యారట. ప్రణతి బ్యాగ్రౌండ్‌ కూడా తక్కువేం కాదు. తండ్రి సీఎంగా చేశారు.. ఎల్‌ఎల్‌బీ చేసి రాజకీయాలపై మక్కువతో తండ్రి బాటలో నడిచారు. ఇలా తండ్రీ కూతుళ్ళ విధీయతే యువనేతకు ప్రణతిని దగ్గర చేసిందని తెలియవచ్చింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఈ ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారని నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇదిగో.. అదిగో అంటూ గత పది పదిహేను ఏళ్లుగా రాహుల్ పెళ్లిపై ప్రచారం జరగని రోజంటూ లేదు. మరి ప్రణతితో ఐనా పెళ్లి ఫిక్స్ అవుతుందో.. లేదంటే ఇది కూడా రూమర్ గా మిగిలిపోయి.. లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గానే యువనేత ఉండిపోతారో చూడాలి మరి.

54-year-old Rahul is married to a 42-year-old MP:

Speculations on Rahul Gandhi Marriage 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs