Advertisement
Google Ads BL

15 వేలు.. 15 వేలు.. జగన్‌పై ట్రోలింగ్


జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు పరదాల చాటున ప్రయాణం చేసేవాడు. అతని రాక కోసం చెట్లు కొట్టెయ్యడం లాంటివి చేసేవారు. జగన్ ఎప్పుడు కింద నడవలేదు, ఎప్పుడూ గాల్లో హెలికాఫ్టర్‌లోనే తిరిగిన జగన్‌కు అధికారం పోగానే ప్రజలు గుర్తొచ్చారు. వైసీపీ నేతలు జైలుకు వెళ్ళగానే వాళ్ళ దగ్గర వాలిపోయి బాధపడిపోతూ నెక్స్ట్ అధికారం మాదే మీ మీద పగ తీర్చుకుంటామంటూ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. 

Advertisement
CJ Advs

వరద బాధితులను పలకరించడానికి విజయవాడ వెళ్లి హడావిడి చేసిన జగన్.. ఆ తర్వాత బెంగుళూరు ప్యాలస్ చెక్కేసి మళ్ళీ పిఠాపురంలో హడావిడి చెయ్యడానికి బయలుదేరిన జగన్‌ను నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. పిఠాపురం, ఏలేరు వరదలు మానవతప్పిదమే.. పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే, చంద్రబాబు నాయుడు డ్రామా ఆర్టిస్ట్ అంటూ కామెడీ చేసిన జగన్‌ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. 

జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందు వంగి వంగి మీకు పదిహేను వేలు, మీకు పదిహేను వేలు అంటూ చేసిన కామెడీ చూసి జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ పాపం అన్నా @PawanKalyan పదవి లాగేసి జగన్‌ను పిచ్చోడిని చేసావ్ కదన్నా అంటూ మాట్లాడుతున్నారు. ఇక బ్లూ మీడియా అయితే మాజీ సిఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిఠాపురం పర్యటనలో భారీ జనసందోహం. జగన్‌ను ప్రజల నుంచి కాపాడలేక ఉక్కిరిబిక్కిరైన భద్రతా సిబ్బంది. ఇటీవల డిప్యూటీ సిఎం పర్యటించినప్పుడు, కేవలం బురదలో నడిచిన కాళ్లమీద వీడియో షూట్ చేసి నవ్వులు పాలయిన విషయం తెలిసిందే.. అంటూ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు.

Trolling on YS Jagan Pithapuram Tour:

YS Jagan Turns Trolling Person in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs