Advertisement
Google Ads BL

దేవర ఇదేం ట్విస్ట్ గురూ..


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నుంచి ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాబోతున్న చిత్రం దేవర. ఈ చిత్రంపై పాన్ ఇండియా మార్కెట్‌లో ఎంతగా అంచనాలున్నాయి అనేది దేవర ప్రీ సేల్స్ చూస్తే తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా విడుదలైన దేవర చిత్ర ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించగా.. మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేసేలా మారింది. 

Advertisement
CJ Advs

అయితే దేవర ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దేవర స్టోరీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవర చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి-కొడుకులుగా కనిపిస్తారనే విషయాన్ని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. దేవరగా ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్‌లు ఫ్రెండ్స్. వారి మధ్యన ఆధిపత్య పోరులో తండ్రి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ చనిపోతాడు. 

కొడుకు కేరెక్టర్‌లో భయస్తుడిగా కనిపిస్తున్న ఎన్టీఆర్ తండ్రి వేషంలో శత్రువులపై పగ తీర్చుకుంటూ బయట మాత్రం భయం నటిస్తాడు, సీనియర్ దేవర చనిపోయిన విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ రహస్యంగా ఉంచుతాడని అంటూ కొంతమంది దేవరలో ఇదే పెద్ద ట్విస్ట్ అంటూ రకరకాలుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి. 

మరి ఇదే దేవర స్టోరీ అయితే గనక రొటీన్ అనే చెప్పాలి. ఇలాంటి కమర్షియల్ కథలు ప్రేక్షకులకు కొత్త కాదు. మరి కొరటాల దేవర ను ఎలా చూపించబోతున్నారో తెలియదు కానీ.. దేవర కథ పై వినిపిస్తున్న కథలు వింటే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నీరసం రావడం ఖాయం.

This is the Twist in Devara Story:

News in Social Media in Devara Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs