2024 ఎలక్షన్‌లో దారుణాతిదారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ పట్ల కార్యకర్తలు నమ్మకాన్ని కోల్పోయారు. మరీ 11 మంది ఎమ్యెల్యేలను గెలిపించుకున్న జగన్ అంటే ఆల్మోస్ట్ నమ్మకం పోయింది. అప్పటి నుంచి వైసీపీ క్యాడర్ నీరుగారిపోయి ఉంది. జగన్ కూడా తాడేపల్లి కన్నా ఎక్కువగా బెంగుళూరు ప్యాలెస్‌లో సేద తీరుతూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు.
గత ఐదేళ్ళలో తన చుట్టూ కోట కట్టిన నేతలను, అలాగే వాలంటీర్లను నమ్మిన జగన్.. కార్యకర్తలను, తన ఎమ్యెల్యేలను, మంత్రులను పట్టించుకోలేదు. ఇక ఓడిపోయాక అప్పుడప్పుడు జగన్ జనం మధ్యలో తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు భజన చేసిన బ్లూ మీడియా కూడా ప్రస్తుతం జగన్ ను మొద్దు నిద్ర నుంచి లేపేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది.
గత వారం విజయవాడ వరద ముంపు ప్రాంతాల ప్రజలను కలిసిన జగన్.. నిన్న ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళాడు. అక్కడకు జగన్ వెళ్లగానే ప్రజలు గుమ్మిగూడారు. అది చూసిన బ్లూ మీడియా అబ్బో జగన్ చుట్టూ జనం.. ఆ జనాన్ని చూసి వైసీపీ కేడర్‌లో ఊపొచ్చింది.. అంటూ వైసీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచే పనిలో పడింది.
అయితే జగన్ చుట్టూ జనం చేరింది ఆయనకు వినతులు చెపుకోవడానికో.. లేదంటే జగన్ చేసిన తప్పులు ప్రశ్నించడానికో.. ఆ జనాన్ని చూసి కేడర్‌లో ఊపురావడమేమిట్రా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.