Advertisement
Google Ads BL

యాంకర్ శ్యామలకు జగన్ కీలక పదవి


గత ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్న శ్యామలకు వైసీపీ ఓటమి పెద్ద షాక్ ఇచ్చింది. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి శ్యామలకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు యాంకర్ గా కాస్త బిజీగా వున్న ఆమె పవన్ కళ్యాణ్ పై విమర్శలు తర్వాత ఉన్న అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 

Advertisement
CJ Advs

ఇక వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేసిన శ్యామలను జగన్ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు శ్యామల కష్టాన్ని గుర్తించి జగన్ ఆమెకి కీలక పదవిని కట్టబెట్టడంతో ఆమె రాజకీయంగా బిజీగా మారబోతుంది. కొద్దిరోజులుగా వైసీపీ పార్టీ ని ప్రక్షాళన చేస్తూ.. పార్టీ కి నష్టం కలిగించే వారిని పక్కనపెడుతున్న జగన్.. కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడు. 

తాజాగా వైసీపీ పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఆ జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఇప్పటివరకు పార్టీపరంగా ఎలాంటి హోదా లేనప్పటికీ.. ఇప్పుడు యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది.. మరి ఇప్పుడు సినిమా అవకాశాలు లేకపోయినా శ్యామలకు రాజకీయంగా అవకాశం లభించింది. 

Jagan who tied the post to Anchor Shyamala:

Anchor Shyamala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs