2024 ఎలక్షన్ లో వైసీపీ తో పాటుగా నగరి ఎమ్యెల్యేగా పోటీ చేసిన ఆర్కే రోజా ఘోర ఓటమి పాలైంది. జగన్ అన్నా అంటూ భజన చేసి మినిస్టర్ పదవి కొట్టేసిన రోజా జగన్ మీద ఈగ వాలనిచ్చేది కాదు, 2024 ఎన్నికల సమయంలో రోజా కు టికెట్ ఇవ్వొద్దు అని నగరి వైసీపీ నేతలు ఎంతగా చెప్పిన జగన్ రోజా కి నగరి టికెట్ ఇచ్చాడు.
ఇక రోజా ఓటమి పాలయ్యాక జగన్ ను రెండు మూడుసార్లు కలిసింది. తన వాళ్లే తనని ఓడించేందుకు కుట్రలు పన్నారని వాపోయిన రోజా కొద్దిరోజులుగా వైసీపి కి, జగన్ కు దూరంగా ఉండడమే కాదు నగరిలోను పెద్దగా కనిపించడమే లేదు. ఎక్కువగా రోజా చెన్నై లో కనిపించడంతో ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్లబోతుంది అనే టాక్ నడిచింది.
ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న రోజా సడన్ గా యాక్టీవ్ అయ్యింది. రీసెంట్ గా రోజా జగన్ మోహన్ రెడ్డి ని మీటయ్యింది. ఆమె మీటయిన నెక్స్ట్ డేనే జగన్ రోజా పై కుట్ర చేసిన వైసీపీ కార్యకర్తలను, నేతలను సస్పెండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రోజా తనపై కొంతమంది కుట్ర పన్నిన విషయాన్ని జగన్ కు చెప్పడంతోనే.. జగన్ రోజా ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన కేజే దంపతులపై వేటుపడడం రోజాకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.
జగన్ పై నమ్మకంతో రోజా జగన్ కు ఫిర్యాదు చెయ్యడంతో.. జగన్ కూడా రోజాను వదులుకోవడం ఇష్టం లేక కేజే దంపతులను పక్కనపెట్టేశారు అని అంటున్నారు. ఈ చర్యతో రోజా తాను అనుకున్నది సాధించడమే కాదు కేజే దంపతులకు చెక్ పెట్టేసింది.