మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి యుఎస్ లో చక్కర్లు కొట్టిన మహెష్ ఈరోజు హైదరాబాద్ కి తిరిగొచ్చారు. ఫ్యామిలిలో సహా ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే మహేష్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. కారణం త్వరలోనే రాజమౌళి-మహేష్ మూవీ అప్ డేట్ రాబోతుంది అని.
రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్నారు. మహేష్ ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చెయ్యడమే కాదు ఆయన కొత్త గా మేకోవర్ అవడానికి కూడా స్పెషల్ గా ట్రైనర్ ని పెట్టుకున్నారు. ఇక సెప్టెంబర్ ల SSRMB ప్రాజెక్ట్ పై కాన్సెప్ట్ వీడియోతో అప్ డేట్ ఇవ్వబోతున్నారని ఎప్పుడో చెప్పడంతో మహెష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
రాజమౌళి ఎప్పుడెప్పుడు మహేష్ మూవీ విషయం చెబుతారా అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇక మహేష్ యుఎస్ ట్రిప్ ముగించుకుని రావడంతో మహేష్ ఫ్యాన్స్ లో ఆశలు మొదలైనాయి. ఏ క్షణాన అయినా SSRMB అప్ డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు వారు.