రాజ్ తరుణ్ ఒకప్పుడు బాణంలా దూసుకొచ్చిన కెరటం.. కానీ ఇప్పుడు కిందా మీదా పడుతున్నాడు. ఒకటా రెండా వరసగా భారీ డిజాస్టర్స్ తో కెరీర్ లో బాగా డౌన్ అయిన రాజ్ తరుణ్ గత నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పురుషోత్తముడు, తిరగబడరా సామి అంటూ ఆడియన్స్ ను పలకరిస్తే వారు నిజంగానే ఎదురు తిరిగారు.
ఆ రెండు సినిమాలు థియేటర్స్ లో విడుదలై మాటల్లో లేకుండా మాయమైపోయాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ మళ్ళీ భలే ఉన్నాడే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు శుక్రవారమే ఆ చిత్రం రిలీజ్. మరి ఈ సినిమా గనక హిట్ అవ్వకపోతే మనోడు షెడ్డుకే అంటూ కొంతమంది రాజ్ తరుణ్ పై చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
భలే ఉన్నాడే చిత్రం గత రాత్రే ప్రెస్ ప్రీమియర్స్ వేసేసారు. మరికాసేపట్లో భలే ఉన్నాడే సినిమా ఎలా ఉందొ అనేది సోషల్ మీడియా టాక్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఇక సినిమా రిజల్ట్ కన్నా రాజ్ తరుణ్ తనపై లావణ్య పెట్టిన కేసు విషయంలో యమా టెన్షన్ గా ఉన్నాడు. అసలే లావణ్య ఇచ్చిన సాక్ష్యాలు కరెక్ట్ అంటూ రాజ్ తరుణ్ పై పోలీసులు ఛార్జ్ షీట్ రెడీ చేసారు.
ఇప్పటికే లావణ్య కేసులో అరెస్ట్ అవకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ కు ఈ ఛార్జ్ షీట్ వలన బెయిల్ రద్దయ్యే అవకాశం లేకపోలేదని మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఈ కుర్ర హీరో భవితవ్యం ఏమిటి అనేది.