హీరో నందమూరి బాలకృష్ణ అంటే చాలామంది హీరోలకు భయం, అందుకు తగ్గ గౌరవం ఉంటాయి. అందులో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్ లు అన్ స్టాపబుల్ దగ్గర నుంచి బాలయ్య కు బాగా క్లోజ్ అయ్యారు. ఈరోజు బాలయ్య వెంట సిద్దు, విశ్వక్ సేన్ లు ఏపీలో అడుగుపెట్టిన విజువల్స్ వైరల్ గా మారాయి.
ఏపీ వ్యాపంగా భారీ వర్షాలకు, వరదలకు విజయవాడ ప్రజానీకం ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడడంతో టాలీవుడ్ స్టార్స్ చాలామంది తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. అయితే ఆ విరాళాలను స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందజెయ్యడం కోసం యంగ్ హీరోలు ఏపీ బాట పట్టారు.
ఈరోజు బాలయ్య తో కలిసి విశ్వక్ సేన్, సిద్దులు విజయవాడకు వెళ్లారు. బాలయ్య మీడియాతో మట్లాడుతూ.. కనీ విని ఎరుగని రీతిలో ఇటువంటి విపత్తు రావడం చాలా బాధాకరం. ప్రజలు చాలామంది నిరాశ్రయులు అయ్యారు, వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి. కళాకారులు వారి వారి షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటారు. ఇప్పుడు సమయం దొరకడంతో వచ్చి అందజేస్తామన్న సహాయాన్ని ప్రభుత్వానికి మేము అందజేస్తున్నామని చెప్పారు.