Advertisement
Google Ads BL

నాని ని ఏదో ఒకటి చెయ్యండి లోకేషూ..


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయ్యింది. కానీ ఇంతవరకు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను, టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బందులు పెట్టి, తూలనాడిన వైసీపీ నేతలను ఏమి చెయ్యకపోవడం పై టీడీపీ కార్యకర్తలు డిజ్ పాయింట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన వారిని లోకేష్ ఇంకా సీరియస్ గా తీసుకోకపోవడంపై వారు కోపంగా ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇక వైసీపీ ప్రభుత్వంలో చెత్త మంత్రిగా, బూతు మంత్రిగా పేరు గాంచిన కొడాలి నాని ని లోకేష్ ఏమి పట్టనట్టుగా వదిలెయ్యడం టీడీపీ కార్యకర్తలకు నచ్చడం లేదు, మూడు నెలలైంది కానీ కొడాలి కి ఇంకా చుక్కలు కనిపించడం లేదు, వైసీపీ ప్రభుత్వంలో కన్ను మిన్ను కానకుండా బిహేవ్ చేసిన కొడాలిని ఎలాగోలా జైలుకు పంపాలి అదే టీడీపీ అభిమానుల కోరిక. 

కొడాలి పై రెండుమూడు కేసులు పడగానే రాజకీయాలకు దూరంగా జరిగాడు. ఓడిపోయిన కొత్తల్లో అటు ఇటుగా కాస్త హడావిడి చేసిన కొడాలి.. ఈ మద్య పాలిటిక్స్ ని పట్టించుకోవడం లేదు. రాజకీయాలకు కొడాలి బై బై చెప్పెయ్యబోతున్నాడు, ఆయన సోదరుడి కొడుకుని తన వారసుడిగా పాలిటిక్స్ లోకి తీసుకురాబోతున్నాడనే టాక్ నడుస్తుంది. 

ఎంతగా రాజకీయాలు పట్టించుకోకపోయినా కొడాలి ని అలా ఊరికే వదిలెయ్యొద్దు లోకేష్ అన్నా అంటూ లోకేష్ ను టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తొందరపెడుతున్నారు. చూద్దాం కొడాలి కి కూటమి ప్రభుత్వం ఇవ్వబోయే గిఫ్ట్ ఏమిటి అనేది. 

Kodali Nani do something Lokesh!!:

Take action on Kodali Nani, Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs