Advertisement
Google Ads BL

96 సీక్వెల్: ఈసారి సేతుపతికి పెళ్లి చేస్తారా..


కోలీవుడ్ లో విజయ్ సేతుపతి-త్రిష జంటగా వచ్చిన 96 అప్పట్లో కల్ట్ క్లాసిక్ సెన్సేషనల్ లవ్ స్టోరీగా యూత్ ని ఎట్రాక్ట్ చెయ్యడమే కాదు.. ఆ చిత్రం సూపర్ సూపర్ హిట్ అవడంతో తెలుగులో శర్వానంద్-సమంత లను పెట్టి దిల్ రాజు జాను గా రీమేక్ చేసారు. కోలీవుడ్ లో హిట్ అయిన 96 తెలుగులో అంతగా ఆడలేదు. ఇప్పుడు 96 కి సీక్వెల్ అనౌన్స్ చేసాడు దర్శకుడు. 

Advertisement
CJ Advs

96 చిత్రం కథలోకి వెళితే స్కూల్ టైమ్ లో పుట్టిన ప్రేమ విజయ సేతుపతి-త్రిషలను ఏకం చేస్తుంది అనుకున్న సమయంలో విజయ్ సేతుపతి అనుకోని కారణాలతో ఊరొదిలి వెళ్లిపోవడం, త్రిష చదువు పూర్తయ్యాక వేరెవరినో పెళ్లి చేసుకోవడం, విజయ్ సేతుపతి వైల్డ్ ఫోటోగ్రాఫర్ అవడం, 10th క్లాస్ రీయూనియన్ అంటూ అప్పటి 96 బ్యాచ్ కలిసినప్పుడు విజయ్ సేతుపతి తన వల్లే పెళ్లి చేసుకోలేదని తెలిసిన త్రిష మానసిక సంఘర్షణకు గురై బరువైన హృదయంతో భర్త దగ్గరకు వెళ్లిపోవడంతో సినిమాను ఎండ్ చేసారు. 

మరి ఇప్పుడు సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు సీక్వెల్ లో విజయ్ సేతుపతి పెళ్లి చేస్తారా? అతని మ్యారేజ్ లైఫ్ గురించి చూపిస్తాడా? లేదంటే త్రిష విజయ్ సేతుపతి కోసం తిరిగి అతని లైఫ్ లోకి ప్రవేశిస్తుందా.. ఎలా 96 సీక్వెల్ ని ప్రేక్షకులకు చూపించబోతున్నారనే విషయంలో ఆడియన్స్ లో చాలారకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

మరి 96 దర్శకుడు ఎలాంటి ప్లాన్ తో 96 సీక్వెల్ ప్రకటించాడో, ఈసారి కథను ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చెయ్యబోతున్నాడో అనేది అందరిలో ఆసక్తిగా మారింది. 

96 sequel arriving:

Vijay Sethupathi and Trisha 96 sequel arriving
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs