బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సల్మాన్ ఖాన్ అన్న అర్భాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైక అరోరా బాబు పుట్టాక భర్త అర్భాజ్ ఖాన్ తో విభేదాలు రావడంతో మలైకా - అర్భాజ్ లు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత అర్భాజ్ మరో ఆమెని పెళ్లి చేసుకున్నాడు.
మలైకా అరోరా మాత్రం కుర్ర హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్లి ఊసెత్తడం లేదు. ఈ మధ్యన మలైకా అరోరా అర్జున్ కపూర్ రిలేషన్ ను కొనసాగించడం లేదు అనే ప్రచారం జరుగుతుంది. అదలా ఉంటే ఈరోజు బుధవారం ఉదయం మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన ముంబై లోని బాంద్రాలో నివాసముంటున్న ఏడంతస్తుల భవనం పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు, అంతేకాదు మలైకా అరోరా మొదటి భర్త అర్భాజ్ ఖాన్ ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకున్నట్లుగా బిటౌన్ టాక్.