బిగ్ బాస్ 8 మొదలై రెండువారాలు కావొస్తుంది. మొదటి వారం హౌస్ నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. తర్వాత వారంలోను నామినేషన్స్ హీట్ హౌస్ ను చుట్టేసాయి. గత రెండు రోజులు నామినేషన్స్ వేడితో హౌస్ మొత్తం రచ్చ రచ్చ గా కనిపించింది. చిన్న విషయాలకే హౌస్ మేట్స్ ని నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ బిగ్ షాకిచ్చాడు.
హౌస్ లో ఉన్న ఆహారాన్ని ఇంక్లూడింగ్ స్పెషల్ ఫుడ్స్, దాచుకున్న ఫుడ్స్ మొత్తాన్ని స్టోర్ రూమ్ లో పెట్టమని బిగ్ బాస్ ఆర్డర్ వేసాడు. ఈ సీజన్ సరికొత్తగా ఉండబోతుంది అంటూ ముందు నుంచి చెబుతున్న బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ లాగేసుకుని హౌస్ మేట్స్ కి షాకిచ్చినట్టే ఇచ్చి మీరు మేమిచ్చిన సమయంలో ఎంత ఫుడ్ తింటారో, ఏమి తింటారో తినమని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
దానితో అందరూ స్టోర్ రూమ్ కు పరిగెత్తి తమకు కావల్సిన ఫుడ్ ని తింటూనే ఉన్నారు. ఎంతగా అంటే బిగ్ బాస్ తమకి ఇచ్చిన సమయం అయిపోయి అలారం మోగుతున్నా పట్టించుకోకుండా ఫుడ్ తినేశారు. మళ్ళీ హౌస్లోకి ఫుడ్ రావాలంటే హౌస్ మేట్స్ కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్స్ ఈరోజు ఎపిసోడ్ లో చూపించబోతున్నారు. మరి హౌస్ మేట్స్ కి ఆ ఫుడ్ అందుతుందో లేదో చూడాలి.