ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దేవర ఫీవర్ తో ఊగిపోతోంది. అటు ఎన్టీఆర్-జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు దేవర ప్రమోషన్స్ తో హడావిడి, ఇటు దేవర ట్రైలర్ అంటూ టీమ్ సందడి. ఇప్పటి వరకు దేవర నుంచి విడుదలైన మూడు సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు మంగళవారం మేకర్స్ దేవర మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేసారు.
2 నిమిషాల 35 సెకన్లున్న ఉన్న ఈ ట్రైలర్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు, యాక్షన్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. దేవర ట్రైలర్ లోకి వెళితే.. ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. తీరప్రాంతంలో ఎలాంటి భయాలు లేని ప్రజలు నివసిస్తుంటారు. అక్కడ ఉండే భైరా (సైఫ్ అలీఖాన్) ఓ క్రూరమైన గ్యాంగ్‌తో ఆకృత్యాలకు పాల్పడుతుంటాడు. ఆ ముఠా అక్కడకొచ్చే ఓడలను దోచుకోవటమే కాకుండా, కోస్ట్ గార్డులను కూడా చంపేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తుంటారు. ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామస్థులకు భయాన్ని పరిచయం చేస్తాడు దేవర (ఎన్టీఆర్). ఆ గ్రామాన్ని పెను ప్రమాదం నుంచి రక్షించే పవర్‌ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ పాత్ర పరిచయం అవుతుంది.
ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆశ్చర్యపరిచే ఎలివేషన్ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ అందరిలో సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతోంది. ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భయానికి అర్థం చెప్పే ప్రతిరూపమైన పాత్ర ఒకటైతే.. భయపడుతూ ఉండే మరో పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు.
భైరా అనే అనే భయంకరమైన పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు. ఎన్టీఆర్, సైఫ్ మధ్య ఉన్న సన్నివేశాలను చూస్తుంటే సినిమా నెక్ట్స్ లెవల్ అనేంతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. ఆమె లుక్స్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఉన్నచక్కటి కెమిస్ట్రీతో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయనిపిస్తుంది.
అనిరుద్ రవిచందర్ అద్భుతమైన సంగీతంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గూజ్‌బమ్స్ వస్తున్నాయి. ట్రైలర్‌లో కొన్ని సీన్స్ అయితే కళ్లకువిందుగా ఉన్నాయి. ట్రైలర్ చివరలో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంది.