దేవర చిత్రం తో సౌత్ ప్రేక్షకులకు పరిచయమవుతున్న జాన్వీ కపూర్.. తంగం అప్పీరియన్స్ ఎలా ఉండబోతుందో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, శ్రీదేవి అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దేవర చిత్రంలో తంగం గా సింపుల్ లుక్స్ తో కనిపించనున్న జాన్వీ కపూర్ సాంగ్స్ లో మాత్రం అందాలు విందు రుచి చూపించింది.
అంతేనా దేవర ప్రమోషన్స్ లోను జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన చూస్తే వావ్ వాటే బ్యూటీ అంటారు. అంత చక్కటి అవుట్ ఫిట్స్ తో జాన్వీ కపూర్ బ్యూటిఫుల్ కాదు కాదు దేవకన్యలా మెస్మరైజ్ చేస్తుంది. నిన్న కపిల్ శర్మ షోకి ఎన్టీఆర్ కి ధీటుగా తయారై వెళ్లిన జాన్వీ నేడు దేవర ట్రైలర్ లాంచ్ కి అదిరిపోయే శారీ లో కనిపించింది.
ఇంకా ముంబై దేవర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ పింక్ శారీ లో దేవకన్యలా కనిపించి కనువిందు చేసింది. అది చూసిన నెటిజెన్స్ పింక్ బ్యూటీ అంటూ మాట్లాడుతున్నారు. ఇంకా దేవర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ ఎన్నెన్ని అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుందో చూద్దాం.