వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన GOAT చిత్రం వినాయకచవితి స్పెషల్ గా గత గురువారం విడుదలైంది. ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ అనిపించుకున్నా తెలుగు, హిందీలో భాషల్లో మాత్రం మేకర్స్ ని నిరాశపరిచింది. మైత్రి మూవీ మేకర్స్ GOAT చిత్రాన్ని ఫ్యాన్సీ డీల్ తో తెలుగు రైట్స్ కొని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు. కానీ GOAT చిత్రంతో మైత్రి వారు భారీగా నష్టపోయేట్టుగా ఉన్నారు.
అయితే తెలుగులో, హిందీలో ఈ చిత్రం నిరాశపరచడానికి కారణాలను దర్శకుడు వెంకట్ ప్రభు రివీల్ చేసారు. GOAT చిత్రంలో క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ సన్నివేశాలను హైలెట్ చెయ్యడంతో అవి తెలుగు ఆడియన్స్ తో పాటుగా, నార్త్ ప్రేక్షకులకు కూడా నచ్చలేదు అందుకే GOAT చిత్రం రెండు చోట్ల పెద్దగా ఆడలేదు అని చెప్పాడు వెంకట్ ప్రభు.
ధోని విజువల్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ద్వారా ఈ చిత్రంలో వెంకట్ ప్రభు చూపించారు. అసలు ధోని ఒప్పుకుంటే ఏదో ఒక సీన్ లో ధోని ని చూపించాలని వెంకట్ ప్రభు అనుకున్నా ధోని ఒప్పుకోకపోవడంతో అలా చెయ్యాల్సి వచ్చింది అని చెబుతున్నారు. ఏది ఏమైనా GOAT తమిళనాట సూపర్ హిట్ గా నిలిచింది.