Advertisement

వైసీపీ పంతం.. సీబీఎన్ పంతానికి ఏడాది!


అవును.. ఒకే ఒక్క అరెస్ట్‌తో వైసీపీ అడ్రస్ లేకుండా పోగా.. మరో పార్టీ టీడీపీకి ఎక్కడ లేని మైలేజ్ వచ్చింది..! మైలేజ్ అనడం కంటే అధికారం అంటే ఇంకా బాగుంటుందేమో..! ఆ సంచలన ఘటన మరేదో కాదు.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఏం చేసైనా సరే సీబీఎన్‌ను అరెస్ట్ చేయాలన్నదే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంతం. ఇదే వైసీపీ చేసిన అతి పెద్ద చారిత్రాత్మక తప్పిదం. ఈ ఒక్క అరెస్ట్‌.. ఓ కీలక పరిణామంగా మారి.. ఇదే నినాదమై ఏపీ రాజకీయాలను తిరగరాసేసింది. కత్తులు దూసుకునేలా ఉన్న నేతలూ ఒక్కటై పొత్తు పెట్టుకున్న పరిస్థితికి తెచ్చిందీ అరెస్ట్. సీన్ కట్ చేస్తే.. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. 30 ఏళ్లు అధికారంలో ఉంటానని.. వైనాట్ 175 అంటూ ఎన్నో కలలు కన్న వైఎస్ రెడ్డి.. ఆఖరికి ప్రతిపక్ష హోదా దక్కించుకోలేక.. క్రికెట్ టీమ్‌కే పరిమితం అయిన పరిస్థితి.

Advertisement

ఎందుకు ఏమైంది..?

శుక్రవారం.. శుక్రవారం.. జైలు.. జైలు.. కోర్టు.. కోర్టు.. ఖైదీ నంబర్ 6093 ఇలా ఒకటా రెండా లేనిపోని పేర్లు పెట్టి.. జగన్‌ను టీడీపీ విమర్శించేది. అక్రమాస్తులు, లక్ష కోట్ల దొంగ అంటూ అసెంబ్లీ వేదికగా.. టీడీపీ అధికారంలో ఉండగా ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ వచ్చిన విమర్శలు. ఇవన్నీ విని విని వేసారిపోయిన వైసీపీ పెద్దలు.. అదే శుక్రవారం రోజున బాబును అరెస్ట్ చేస్తేగానీ వీటన్నింటికీ సెట్ అవ్వదని ప్లాన్ చేసిన జగన్.. స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ తెరపైకి తెచ్చింది. ఇది ఎంతవరకూ నిజమో అబద్ధమో అనేది అలా ఉంచితే.. అరెస్ట్ చేయాలంతే అని పంతానికి పోయి మరీ బస్సులో నిద్రిస్తున్న చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ను బెయిల్‌పై తీసుకురావడానికి టీడీపీ భగీరథ ప్రయత్నాలే చేసింది.. ఆఖరికి దేశంలోనే మోస్ట్ పాపులర్ లాయర్ సిద్దార్ధ్ లూథ్రాను రంగంలోకి దిగినప్పటికీ.. తెలుగు లాయర్, ప్రభుత్వ తరఫున వాదించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి నానా తిప్పలు పెట్టారు. లూథ్రాకు కోట్ల రూపాయిలు వెచ్చించినట్లుగా వార్తలు గుప్పుమన్నాయ్ కూడా.

జైలు రుచి చూపించి..

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆ మధ్య చంద్రబాబు పదే పదే రెచ్చగొట్టే ప్రసంగం చేశారని.. ఇదే జగన్ ఇగో హర్ట్ చేసిందన్నది నాడు ఎక్కువగా వినిపించిన మాటలు. జగన్ తండ్రి 26 ఎంక్వయిరీలు వేసి ఏమీ పీక్కోలేకపోయాడు. పిల్ల బచ్చా జగన్.. నన్ను టచ్ చేసే దమ్ముందా..? ఇలా ఒకటా రెండా బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్‌లలో చంద్రబాబు చాలానే కామెంట్స్ చేశారు. ఇక తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ శ్రేణులు అంటారా మీడియా, సోషల్ మీడియా వేదికగా లెక్కలేనన్ని కామెంట్స్ చేయడంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించిన వైసీపీ.. స్కిల్ అంటూ అక్రమ కేసు పెట్టి నంద్యాల పర్యటనలో.. అది కూడా నిద్రలో ఉండగానే చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ. రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది.

పెను సంచలనం..

చంద్రబాబు అరెస్ట్.. ఈ వార్త నాడు గల్లీ నుంచి ఢిల్లీనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. ఇన్నాళ్లు ఎవరు టచ్ చేయాలన్నా భయపడేవారు.. జగన్ టచ్ చేయడమే కాదు జైలుకు కూడా పంపించారని వైసీపీ శ్రేణులు తెగ సంబరపడిపోయాయి. అయితే.. అధినేత అరెస్ట్‌ను ఖండిస్తూ తెలుగోడు ఉన్న ప్రతిదేశంలోనూ నిరసనలు, ర్యాలీలు చేసిన విజనరీని విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు, వీరాభిమానులు హడావుడి చేశాయి. అరెస్ట్ చేసేశామని జగన్ చంకలు గుద్దుకున్నారు కానీ.. ఇక్కడే తప్పలో కాలేశారు. చంద్రబాబు అరెస్ట్ కావడం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తుపై చర్చ జరగడం ముందుకెళ్లడం.. కేంద్రంలో అప్పటికే అధికారంలో ఉన్న బీజేపీతో కూడా కలిసి కూటమిగా ఏర్పడింది. ఇక ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రావడం.. ఎన్నికల ప్రచారం షురూ చేసి.. ఇదే పంతంతో (అధికారమే లక్ష్యంగా) జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లడంతో సింపతీ వచ్చింది.. దెబ్బకు వైసీపీ కూసాలు కదిలిపోయి.. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పోటీచేసిన గుద్దుడే.. గుద్దుడే.. సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Chandrababu arrest a year ago:

Jagan vs Chandrababu Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement