Advertisement
Google Ads BL

ముంబై లో దేవర : అతిలోక సుందరిలా జాన్వీ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ ని ముంబై వేదికగా స్టార్ట్ చేసేసారు. ఈరోజు సోమవారం ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కలవడమే కాదు.. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ లతో కలిసి ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు. గళ్ళ చొక్కాతో ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపించాడు. 

Advertisement
CJ Advs

జాన్వీ మాత్రం.. శ్రీదేవి కూతురు అనిపించేలా అతిలోక సుందరిలా దర్శనమిచ్చింది. దేవర ప్రమోషన్స్ నిమిత్తం జాన్వీ కపూర్ ఏంజిల్ లా రెడీ అయ్యి వెళుతుండగా.. ఫోటో గ్రాఫర్స్ వీడియోస్, అలాగే ఫోటోలు తియ్యడానికి ఎగబడ్డారు. 

జాన్వీ నిజంగా దేవతలా కనిపించింది. బ్లూ మోడ్రెన్ డ్రెస్ లో జాన్వీ కపూర్ అందాలు కనిపించి కనిపించనట్టుగా యూత్ ని పడేసేలా ఉన్నాయి. మరి దేవర సినిమాలో తంగం కేరెక్టర్ లో ఎలా కనిపించినా ప్రమోషన్స్ లో మాత్రం జాన్వీ కపూర్ అందరి కళ్ళు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. ఎన్టీఆర్ పక్కన హైలెట్ అవ్వాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Devara in Mumbai:

Devara in Mumbai: Janhvi Kapoor is like a beauty of the world
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs