Advertisement
Google Ads BL

పండగ, ఆదివారం కూడా బ్రేక్ తీసుకోని ప్రభాస్


కల్కి విడుదల తర్వాత ఇటలీ వెకేషన్ ని వెళ్లొచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్కడి నుంచి రాగానే మారుతి దర్శకత్వం లో రాజా సాబ్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. 2025 ఏప్రిల్ టార్గెట్ గా విడుదలకు రెడీ అవుతున్న రాజా సాబ్ షూటింగ్ కి ప్రభాస్ అస్సలు బ్రేక్ ఇవ్వడం లేదు. అది ఎంతెలా అంటే.. 

Advertisement
CJ Advs

శనివారం వినాయక చవితికి కానీ, తర్వాత రోజు ఆదివారం కానీ బ్రేక్ తీసుకోనంతగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ముగ్గురు హీరోయిన్స్ అయిన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అలాగే ప్రభాస్ పై దర్శకుడు మారుతి కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ముందు ప్రభాస్ ద రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసేసి హను రాఘవపూడి తో చెయ్యబోయే మూవీ కోసం వెళ్ళిపోవాలి. రీసెంట్ గానే హను రాఘవపూడి-ప్రభాస్ ల చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ చిత్రంతో పాటుగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. 

Prabhas into romantic mode for Raja Saab:

 The Raja Saab: Prabhas readies for Romance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs