Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్: సందీప్ రెడ్డి ని మీటయిన ఎన్టీఆర్


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబై లో ఉన్నారు. ఆయన రేపు జరగబోయే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు. నిన్న ఆదివారమే ముంబై చేరుకున్న ఎన్టీఆర్ ఈరోజు సోమవారం యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ను మీటవడం హాట్ టాపిక్ అయ్యింది. సందీప్ రెడ్డి తెలుగు వాడే. అర్జున్ రెడ్డి తర్వాత హిందీలో అడుగుపెట్టి సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ అవతారమెత్తాడు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్నారు. అక్కడే ముంబైలో ఉన్న సందీప్ రెడ్డి వంగాను ఎన్టీఆర్ మీట్ అయిన ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి. మాస్ హీరో-మాస్ డైరెక్టర్ కలిసి కనిపిస్తే ఎన్నో రకాల ఊహాగానాలు పుట్టుకొస్తాయి. అవి ఏమిటో వేరే చెప్పక్కర్లేదు. 

మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డిని ఎన్టీఆర్ కలవడంపై అందరిలో ఏవేవో ఆలోచనలు, ఇద్దరూ కలిసి ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారేమో అని కొంతమంది అనుకుంటే.. మరికొందరు ఎన్టీఆర్ సందీప్ రెడ్డిని దేవర ట్రైలర్ లాంచ్ కోసం ఆహ్వానిస్తున్నాడేమో అంటూ ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. 

Interesting: NTR met Sandeep Reddy Vanga:

NTR meets Sandeep Reddy Vanga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs