Advertisement
Google Ads BL

రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యింది : తమన్నా


మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం సౌత్, హిందీ అంటూ కలయతిరిగేస్తుంది. హిట్, ప్లాప్స్ తో పని లేకుండా ఇప్పటికి దూసుకుపోతున్న తమన్నా ఇన్నేళ్ల కెరీర్ లో ప్రేమకు దూరంగా ఉంది అనుకుంటారు. కానీ ఆమె కొన్నేళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో సీక్రెట్ డేటింగ్ చేసింది. ఆ విషయం గత ఏడాదే బయటికొచ్చింది.

Advertisement
CJ Advs

అప్పటినుంచి తమన్నా-విజయ్ వర్మలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. కానీ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈ జంట ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేకుండా గడిపేస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూ లో తమన్నా తన లైఫ్ లో రెండు బ్రేకప్స్ అయ్యాయి, రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది అంటూ చెప్పి షాకిచ్చింది.

రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యింది. ఆ సమయంలో చాలా బాధనిపించింది. ఒక వ్యక్తి కోసం నాకు ఇష్టమైన కెరీర్ ని వదులుకోవాలనిపించలేదు. లైఫ్ లో ఏదో సాధించాలనే కోరిక నాది. ఆ కారణంగానే ఆ బంధం నిలుకోలేదు. ఆ తర్వాత మరొకరితో రిలేషన్ లో ఉన్నాను, అతను కూడా నాకు సెట్ అవ్వడు అనిపించింది.

ప్రతి చిన్న విషయానికి అబద్దాలు చెప్పే వారంటే నాకు నచ్చదు. అలా ఆ రిలేషన్ లోను ఉండలేకపోయాను.. ఆ తర్వాత చాలా సఫర్ అయ్యాను అంటూ తమన్నా తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకొచ్చింది. 

Tamannah Opened Up About Her Breakups:

Tamannaah Bhatia Reveals Key Lessons From Her Two Breakups
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs