Advertisement
Google Ads BL

రాజ్ తరుణ్ కి లావణ్య అన్ని లక్షలిచ్చిందా?


రాజ్ తరుణ్-లావణ్య కేసు సీరియల్ లా సాగుతూనే ఉంది. నిన్నటివరకు లావణ్య నే తప్పు చేసింది, ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నందు వలనే రాజ్ తరుణ్ ఆమెని వదిలేసాడు అంటూ ఉంటే.. లావణ్య మొదటినుంచి రాజ్ తరుణ్ మరో హీరోయిన్ మోజులో తనని మోసం చేస్తుందని ఆరోపిస్తుంది. ఈ కేసు కోర్టులో ఉంది. రాజ్ తరుణ్ అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఈలోపు పోలీసులు లావణ్య ఆరోపణలు నిజమే, రాజ్ తరుణ్-లావణ్య పదేళ్ల పాటు సహజీవనం చేసారు, తాము ఆధారాలు సేకరించమంటూ రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ రెడీ చెయ్యడంతో ఒక్కసారిగా లావణ్య వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. రాజ్ తరుణ్-హీరోయిన్ మాల్వి మమల్హోత్ర లను ముంబై హోటల్ లో లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిపై కేసు పెట్టడంతో ఈ వ్యవహారం ముంబై కి షిఫ్ట్ అయ్యింది. 

ఇప్పుడు తాజాగా లావణ్య రాజ్ తరుణ్ తనని పోషించలేదు, నేనే రాజ్ తరుణ్ ని పోషించానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తల్లిదండ్రులు రాజ్‌ తరుణ్ కు 70 లక్షలు డబ్బులు ఇచ్చారని, రాజ్ సినిమాలు లేకుండా రెండేళ్లు ఖాళీగా ఉండిపోయిన సమయంలో తన పేరెంట్స్ తమకున్న స్థలాలు అమ్మి 70 లక్షల రూపాయల డబ్బు రాజ్‌ తరుణ్ కి ఇచ్చారంటూ లావణ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

అంతేకాదు ఆ స్థలాలు తన పేరెంట్స్ అమ్మిన తేదీలు, రాజ్‌కు డబ్బులు ఇచ్చిన చెక్కులకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని లావణ్య సంచలన విషయాలు బయటపెట్టింది. 

Did Lavanya give 70 lakhs to Raj Tarun?:

We gave Rs. 70 lakhs to Raj Tarun!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs