నందమూరి హీరోలంటేనే బబ్లీ గా ఉంటారు అంటూ చాలామంది మాట్లాడుకుంటారు. బాలయ్య, యంగ్ టైగర్ వీళ్లంతా కాస్త బరువు తో కనిపించే హీరోలే. ఇప్పుడంటే ఎన్టీఆర్ స్లిమ్ గా అయ్యాడు కానీ.. అతని కేరీర్లో ఒకొనొక సమయంలో చాలా బరువు పెరిగి అభిమానులను టెన్షన్ పెట్టాడు. ఇక బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కూడా ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు.
ఎప్పుడైనా మోక్షజ్ఞ బొద్దుగా, బరువు గా కనిపించినప్పుడల్లా నందమూరి అభిమానులు ఆందోళన పడిపోయేవారు. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ పై సోషల్ మీడియాలో ఏంతో హైప్ ఉంటే ఆయన మాత్రం బరువుగా దర్శనమిచ్చేవాడు. దానితో మోక్షు మేకోవర్ విషయంలో అభిమానుల్లో టెన్షన్ నడిచేది. అంతేకాదు మోక్షు బరువుపై చాలామంది ట్రోల్ చేసేవారు.
కానీ మోక్షజ్ఞ మాత్రం హీరో గా ఎంట్రీ ఇచ్చే సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో మతిపోయే మేకోవర్ కి మారిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబొయే మూవీ ఫస్ట్ లుక్ తోనే ట్రోలర్స్ కు మోక్షజ్ఞ చెక్ పెట్టేసాడు. మోక్షజ్ఞ లుక్ చూడగానే అభిమానులు అబ్బురపడిపోతే ట్రోలర్స్ కి మాటపడిపోయింది.
అంత చక్కటి ఫిట్ నెస్ తో, కూల్ లుక్స్ తో క్లాసీగా గా మోక్షజ్ఞ కనిపించాడు. మరి కేవలం అనౌన్సమెంట్ కే మోక్షు పై అంతగా అంచనాలు ఏర్పడితే సినిమా సెట్స్ మీదకెళితే ఇంకెన్ని అంచనాలు పెరుగుతాయో.. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.