రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్ పై, తనని బెదిరిస్తున్నారంటూ రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడి పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను కూడా లావణ్య పోలీసులకు సమర్పించింది.
ఈ క్రమంలో రాజ్ తరుణపై కేసు నమోదు కావడంతో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. తాజాగా రాజ్‌తరుణ్, లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది. లావణ్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని, ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని, ఈమేరకు లావణ్య ఇంటి నుంచి పూర్తి ఆధారాలు సేకరించారు పోలీసులు.
ఈమేరకు ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు. తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో రాజ్ తరుణ్ బెయిల్‌ను రద్దుచేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. పోలీసుల దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై లావణ్య స్పందించింది. ధర్మమే గెలిచిందని, తామిద్దరం గుడిలో వివాహం చేసుకున్నామని,పోలీసుల ఛార్జ్‌షీట్‌పై ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
తమను విడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా మాల్వి తన భర్త రాజ్ తరుణ్ ను తనకు వదిలేయాలని, తాము పెళ్లి చేసుకుని కాపురం చేశామని కూడా చేశామంటూ మరోసారి లావణ్య చెప్పుకొచ్చింది.