నగరి వైసీపీ మాజీ ఎమ్యెల్యే రోజా రెండు రోజుల క్రితం విజయవాడ మునిగిపోతుంటే చంద్రబాబు పడవలేసుకుని వెళుతుంటే మంత్రులు, పవన్ కళ్యాణ్ షికార్లు చేస్తున్నారు, చంద్రబాబు ఇంటి కోసం బుడమేరు ని విజయవాడ మీదకు వదిలారు అంటూ చేసిన కామెంట్స్ పై వెంటనే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తాను గనక వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే అక్కడ సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతాయని తాను వెళ్లలేదని.. వైసీపి నేతలు విమర్శించడం పక్కనపెట్టి ముందు కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని హితవు పలికారు.
తాజాగా కిర్రాక్ ఆర్పీ రోజాపై రెచ్చిపోయి కామెంట్స్ చేసాడు. గతంలో అంటే 2024 ఎన్నికల సమయంలో రోజా జబర్దస్త్ కమెడియన్స్ పై చేసిన వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ ఇప్పటికి రోజాపై ఫైర్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చుని పవన్ కళ్యాణ్ ని విమర్శించిన రోజా పై ఆర్పీ ఫైర్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు నాడు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే అందరూ వచ్చి ఆయనకు విషెస్ చెబుతారు. అందరూ వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అప్పుడు ఆయన నవ్వుకుంటూ దణ్ణం పెట్టాలా, అందుకే ఆయన బయటకు వెళ్ళలేదు. అయితేనేమి ఆరు కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇంట్లో కూర్చుని మాట్లాడే నువ్వు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చావా, పవన్ పై కామెంట్స్ చేసే ముందు నువ్వు ప్రజలకేం చేసావో ముందు చూసుకో అంటూ ఆర్పీ రోజా పై విరుచుకుపడ్డాడు.