అక్కినేని నాగార్జున ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ సమంత నాగ చైతన్య తో పెళ్లి బంధాన్ని నిలుపుకోలేక విడాకులు తీసుకుని వేరయ్యింది. నాగ్ మరో కొడుకు అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ తోనే బ్రేకప్ చెప్పేసాడు. ఇప్పడు నాగార్జున ఇంటికి మరో హీరోయిన్ కోడలిగా అడుగుపెట్టేందుకు సిద్దమైంది. నాగ చైతన్య కు భార్యగా అతి త్వరలోనే హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది.
ఆగష్టు 8 న నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థంతో అఫీషియల్ గా శోభిత నాగ్ కోడలిగా మారిపోయింది. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏదాడి మార్చి లో కానీ చైతు-శోభితల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తం పెట్టబోతున్నారు. మరి హీరోయిన్ అన్నాక సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో తరచూ దర్శనమిస్తూనే ఉంటారు. అదే మాదిరి నిశ్సితార్ధం తర్వాత శోభితపై ఇంతకు ముందు ఉన్న అటెన్షన్ మరికాస్త ఎక్కువైంది.
తాజాగా శోభిత దూళిపాళ్ల చీర కట్టు ఫొటోస్ బయటకి రాగానే అక్కినేని ఇంటి కోడలు అడుగుపెట్టబోయే శోభిత శారీ లుక్ చూసి చక్కగా అందంగా, ఆకర్షణగా ఉంది నాగ్ కోడలు, చైతూని పెళ్లి చేసుకున్నాక శోభిత అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లడంపై ఇప్పటినుంచే దృష్టి పెట్టిన్నట్టుగా కనిపిస్తుంది ఆమె తాజా లుక్ అంటూ అక్కినేని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.