Advertisement
Google Ads BL

వరద బాధితులకు పవన్-మహేష్ భారీ విరాళం


ఏపీ-తెలంగాణ లో భారీ వర్షాలకు, వరదలకు జన జీవనం అస్తవ్యస్తం అవడంతో ఎంతోమంది ప్రజలు ఉన్న ఇంటి నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పునరావాస కేంద్రాల్లో తల దాచుకుంటున్నారు. ఆహారం కోసం అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ హీరోలు వరద సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ విరాళాలు ఇస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం ప్రకటించగా.. విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం.. త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీలు  రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. 

దర్శకుడు వెంకీ అట్లూరి.. రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం, నందమూరి బాలకృష్ణ.. రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్...

ఇక ఇపుడు మహేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాల వరద సహాయార్ధం 50 లక్షలు ప్రకటించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రేపు సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయల విరాళం అందిస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. 

 

Pawan Kalyan-Mahesh donate huge to flood victims:

Pawan Kalyan And Mahesh Babu Contributes One Crore Each For Flood Relief
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs