Advertisement
Google Ads BL

బాబు వలన జగన్ ఇరుక్కున్నాడు


చంద్రబాబు నాయుడు వలన జగన్ కూడా ఇప్పుడు వరదల్లోకి వచ్చి ప్రజలను పరామర్శించాల్సి వచ్చింది. గత ఐదేళ్లుగా వరదలొచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేస్తూ హెలికాఫ్టర్‌లో తిరిగిన జగన్.. ఇప్పుడు నేల మీదకి దిగి ప్రజల్లోకి వెళ్లి వారిని పరామర్శించడం చూసిన వారు అయ్యో జగన్.. చంద్రబాబు నాయుడు వలన నీకు ఎన్ని కష్టాలొచ్చాయి.. అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి పర్యటిస్తూ ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి చంద్రబాబు ప్రజల్లోనే ఉంటున్నారు. నిద్రాహారాలు మానేసి.. ప్రజల కోసం పాటుపడుతున్నారు. అది చూసిన జగన్ తప్పక ప్రజల్లోకి రావాల్సి వచ్చింది. తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన జగన్ అక్కడ నుంచి వెంటనే విజయవాడలో వాలిపోయాడు.

భారీ వర్షాలు, వరదల ప్రభావంతో అతలాకుతలమైన విజయవాడలో జగన్ పర్యటించారు. అది చూసిన నెటిజెన్స్ అయ్యో జగన్ చంద్రబాబుని చూసి ఇరుక్కున్నాడు. లేదంటే ఐదేళ్ళలో ప్రజల్లోకి వెళ్లని మనిషి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక వెళ్లక తప్పలేదు. సీఎం అంతటివాడే నీళ్ళల్లో నడుస్తూ కష్టపడుతుంటే తాను ఇంట్లో కూర్చుంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అని జగన్ అలా తిరగాల్సి వచ్చింది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.

Jagan is stuck because of Babu:

Problems to YS Jagan With Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs