రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతున్నాయి. మహానగరాల్లో వరదల కారణంగా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ప్రభుత్వాలు హాలీడేస్ ప్రకటించేశాయి. విజయవాడ నగరాన్ని బుడలేరు, కృష్ణా నదులు ముంచెత్తాయి. సింగ్ నగర్, భవాని పురం, యలమలకుదురు, రామలింగేశ్వర నగర్, ఒకటేమిటి పలు కాలనీలు వరద నీటిలో నానుతున్నాయి. ప్రజలు సహాయక చర్యల కోసం, తినడానికి ఆహారం కోసం అల్లాడిపోతున్నారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదలైన గబ్బర్ సింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో నడవడం చూసిన వారంతా భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రాలు కొట్టుకుపోతున్నా వీరాభిమానులు మాత్రం తమ హీరో సినిమా కోసం ఆగట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదేమైనా కొత్త సినిమా కూడా కాదు.. గబ్బర్ సింగ్ సినిమాని మేకర్స్ రీ-రిలీజ్ చేశారు.
అది ఇప్పటికే యూట్యూబ్‌లో, టీవీ ఛానల్స్‌లో పలుమార్లు వచ్చింది. అయినప్పటికీ ఆ సినిమాని థియేటర్స్‌లో మళ్ళీ చూడడానికి ఫ్యాన్స్ పరుగులు పెట్టారు. పవన్ బర్త్ డే స్పెషల్‌గా రీ-రిలీజ్ అయిన గబ్బర్ సింగ్‌కి అభిమానులు నుంచి విశేష ఆదరణ లభించింది. రీ రిలీజ్ ట్రెండ్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.