Advertisement
Google Ads BL

పదేళ్లుగా అతని ప్రేమలో సాయిపల్లవి!


నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. తన అభినయంతో కెరీర్‌లో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ అందరి మదిలో గుర్తుండిపోయే పాత్రలతో హైలెట్ అవుతూ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఎలాంటి గ్లామర్ ప్రయత్నాలు చేయదు. అందాలు ఆరబోస్తేనే అవకాశం అంటే అలాంటి వాటికి సాయి పల్లవి ఆమడదూరం ఉంటుంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో తండేల్ మూవీలో నటిస్తున్న సాయి పల్లవి తమిళనాట శివకార్తికేయన్ హీరోగా కమల్ నిర్మిస్తున్న అమరన్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు అన్నిటికి మించి బాలీవుడ్ రామాయణలో రణబీర్ కపూర్ సరసన సీత కేరెక్టర్ చేస్తుంది. దానితో సాయి పల్లవి పేరు నార్త్ నుంచి సౌత్ వరకు మోగిపోతుంది. 

అయితే సాయి పల్లవి ప్రేమ విషయంలో గతంలో తమిళ దర్శకుడిని సాయి పల్లవి ప్రేమ వివాహం చేసుకుందని, సీక్రెట్‌గా ఆమెకి అతన్ని వివాహమాడింది అనే ప్రచారం జరిగినా అది జస్ట్ రూమర్‌గా మిగిలిపోయింది. తాజాగా ఆమె తనకి పదేళ్లుగా అభిమన్యుడు అనే అతను చాలా ఇష్టమంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

తనకి మహాభారత ఇతిహాసం అంటే చాలా ఇష్టమని, అందులో అర్జునుడు కొడుకు అభిమన్యుడు అంటే ఇష్టం, గత 17 ఏళ్లుగా అభిమన్యుడు గురించి తెలుకుంటున్నాను, పదేళ్లుగా అభిమన్యుడుని ప్రేమిస్తున్నాను అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

Sai Pallavi Shocking Comments About Her Lover:

Sai Pallavi Love with Abhimanya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs